వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారిగామి వైద్యానికి ఓకే.. శ్రీనగర్ నుంచి ఎయిమ్స్‌ తరలింఫునకు అనుమతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లోయలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సీఆర్పీఎఫ్ బలగాల నీడన జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాజకీయ నేతలను ఇప్పటికే గృహ నిర్బందంలో ఉంచిన సంగతి తెలిసిందే. తన తల్లి మెహబూబా ముఫ్తీని కలుసుకోవాలని ఆమె కూతురు వేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. మరోవైపు సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తారిగామిని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ తరలించేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది.

ఆర్డర్.. ఆర్డర్... ముప్తీని కలిసేందుకు ఓకే.. ఇలాంతిజాకు పర్మిషన్ ఇచ్చిన సుప్రీంకోర్టుఆర్డర్.. ఆర్డర్... ముప్తీని కలిసేందుకు ఓకే.. ఇలాంతిజాకు పర్మిషన్ ఇచ్చిన సుప్రీంకోర్టు

సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తారిగామి సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే కూడా. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తారిగామిని చూసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ... ఆయన శ్రీనగర్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తారిగామి అనారోగ్య సమస్య నేపథ్యంలో ఎయిమ్స్‌కు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో సీతారాం ఏచూరి పిటిషన్ వేశారు. దీనికి సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

Supreme Court allows shifting of CPM leader Tarigami to AIIMS

అంతేకాదు తన స్నేహితుడు తారిగామిని ఎందుకు నిర్బంధించారని సుప్రీంకోర్టులో ఏచూరి పిటిషన్ వేశారు. దీనిపై వారంలో నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మెరుగైన చికిత్స కోసం తారిగామిని ఎయిమ్స్ తరలిస్తే ఇబ్బంది లేదని న్యాయస్థానం దృష్టికి తన వాదనలను వినిపించారు సీతారాం ఏచూరి. కానీ ఓ మాజీ ఎమ్మెల్యేను నిర్బంధించడం సరికాదని .. హెబియస్ కార్పస్ పిటిషన్ కిందకు వస్తోందని పేర్కొన్నారు.

English summary
Supreme Court on Thursday ordered shifting of ailing CPM leader Mohd Yusuf Tarigami to AIIMS in Delhi from Srinagar where he is under house arrest. The Supreme Court also issued a notice to the Centre asking it to respond to Sitaram Yechury’s allegation that his colleague MY Tarigami was illegally detained in Srinagar without official orders. The centre has been asked to respond within a week. The notice was served in response to an affidavit filed by Sitaram Yechury. The court directed the government to shift ailing MY Tarigami to AIIMS from Srinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X