హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ముగ్గురు సభ్యులతో కమిటీ, 6నెలల గడువు

|
Google Oneindia TeluguNews

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరునెలల్లో విచారణను పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.మాజీ న్యాయమూర్తి సిర్ పుర్కర్ చైర్మన్‌గా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఎన్‌కౌంటర్ సమగ్ర నివేదికను ఆరునెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేశారు.

 దిశ ఎన్‌కౌంటర్ నిందితుల విచారణ వాయిదా, సుప్రీంకోర్టులో ఉన్నందునే, గురువారం విచారణ.. దిశ ఎన్‌కౌంటర్ నిందితుల విచారణ వాయిదా, సుప్రీంకోర్టులో ఉన్నందునే, గురువారం విచారణ..

 వాదనలు ఇలా

వాదనలు ఇలా

అంతకుముందు పిటిషన్‌పై పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగాయి. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించింది. ఈ కేసుకు సంబంధించి ఎందుకు పిటిషన్ వేశారని సీజేఐ పిటిషన్లరు ప్రశ్నించారు. కేసుపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అడిగారు. దిశ‌పై లైంగికదాడి కలచివేసిందని.. అయితే నిందితులను పోలీసులు కావాలనే ఎన్ కౌంటర్ చేశారని ధర్మాసనానికి వివరించారు.

ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్

ఉద్దేశపూర్వకంగా ఎన్‌కౌంటర్ చేసి, కథ అల్లారని పేర్కొన్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వ తరఫున ముకుల్ రోహత్గిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును రోహత్గి సీన్ టు సీన్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని వివరించారు. దిశ మొబైల్ ఇస్తామని చెప్పి రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. కర్రలతో దాడి చేశాక.. తుపాకీ తీసుకున్నారని వివరించారు.

తుపాకీ తీసుకొని

తుపాకీ తీసుకొని

నిందితులు తుపాకీ లాగిన సమయంలో ఏం జరిగిందిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బొడ్డే అడిగారు. కాల్పులు జరిపే ప్రయత్నం చేశారా అని కొశ్చన్ చేశారు. కాల్పులు జరిపారని, కానీ పోలీసులకు మాత్ర తగల్లేదని చెప్పారు. ఈలోపు పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు చనిపోయారని పేర్కొన్నారు. ఘటనపై ఇప్పటికే జాతీయ మావన హక్కలు కమిషన్ విచారణ జరిపిందని రోహత్గి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు జరిపిస్తోందని చెప్పారు. ఈ సమయంలో మరో దర్యాప్తు సంస్థ అవసరం లేదని సూచించారు. కానీ విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం మొగ్గుచూపింది.

సహకరించాలి..

సహకరించాలి..

తాము ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యుల విచారణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. సిట్ దర్యాప్తుతో పాటు సమాంతరంగా రిడైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. సిట్ తన దర్యాప్తు వివరాలను విచారణ కమిటీతో పంచుకోవాలని సూచించింది.

English summary
supreme court appointed committee on disha accused encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X