వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 రోజుల్లో రాఫెల్ ధరల వివరాలు తెలపండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

రాఫెల్ వివాదం ముదురుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా రాఫెల్ వివాదంలో సుప్రీం కోర్టుకూడా జోక్యం చేసుకుంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన ఒప్పందం వివరాలు,ధరల వివరాలు కోర్టుకు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. అంతేకాదు రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా వివరించాలని పేర్కొంది. ఈ వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఉంచి పది రోజుల్లో సమర్పించాలని కోరింది.

పార్లమెంటుకు కూడా ధరల వివరాలు తెలపలేదు

పార్లమెంటుకు కూడా ధరల వివరాలు తెలపలేదు

రాఫెల్ యుద్ధ విమానాల వివరాలు సీల్డ్ కవర్‌లో సమర్పించాలన్న సుప్రీం ఆదేశాలకు కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సమాధానం ఇచ్చారు. పార్లమెంటు ముందు కూడా రాఫెల్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని ఈ క్రమంలోనే సుప్రీంకోర్టుకు కూడా రాఫెల్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వలేమని తెలిపారు. ఇదే విషయాన్ని అఫిడవిట్‌లో చేర్చాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు తెలిపింది. క్రితం సారి కేసు కోర్టుముందుకు వచ్చినప్పుడు రాఫెల్‌లో జరిగిన నిర్ణయాల క్రమాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. అయితే ఇది కేవలం జడ్జీలకు మాత్రమే చెప్పాలని ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. అయితే ధరల విషయం గురించి ప్రస్తావించాల్సిన పనిలేదని క్రితంసారి జరిగిన వాదనల్లో సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ సారి మాత్రం కోర్టు మరో అడుగు ముందుకు వేసి ధరల విషయాలను కూడా పేర్కొనాలని సూచించింది.

కోర్టుకు మాత్రమే వివరాలు తెలపండి

కోర్టుకు మాత్రమే వివరాలు తెలపండి


రాఫెల్ విమాన కొనుగోలుపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నందున వాటిని నివృత్తి చేసే బాధ్యత ప్రబుత్వానిదే అని కోర్టు తెలిపింది. అంతేకాదు ఇందులో ఆఫ్‌సెట్ పార్ట్‌నర్‌గా ఎవరుంటారు అనే విషయం కూడా స్పష్టం చేయాల్సిన అవసరముందని కోర్టు భావించింది. ఒకవేళ ఏమైన బహిర్గతం చేయకూడని విషయాలు ఉంటే అవి కోర్టుకు మాత్రమే తెలపాలని... ఆ విషయాలను పిటిషనర్లకు సైతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.

కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్

కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్


ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఆ ప్రభుత్వంతో 8.7 బిలియన్ డాలర్ల మేరా ఒప్పందం కుదుర్చుకుంది మోడీ సర్కార్. ఇది 2015లో జరిగింది. ఈ ఒప్పందంతో అంతకుముందు యూపీఏ సర్కార్ చేసుకున్న ఒప్పందం రద్దయ్యింది. నాటి యూపీఏ సర్కార్ 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో 108 యుద్ధ విమానాల తయారీ భారత్‌లో జరగాలంటూ అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో జరగాలంటూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలోనే సుప్రీంకోర్టు లాయర్లు వినీత్ దండా, ఎమ్ఎల్ శర్మ, ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో రాఫెల్ పై వస్తున్న ఆరోపణలపై ప్రత్యేక బృందంతో విచారణ జరపాలని పిటిషనర్ సంజయ్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

English summary
The Supreme Court on Wednesday directed the National Democratic Alliance (NDA) government to provide within 10 days pricing details of the 36 Rafale fighter jets bought from France.The government’s top law officer KK Venugopal, however, told the court that it would not be possible for the government to provide pricing details to the court since this information had not been provided to Parliament either.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X