వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనాథ టాపర్‌ -ఐఐటీ సీటు వివాదంపై సుప్రీంకోర్టు కీలక సూచన -చిన్న క్లిక్‌తో అంతా తలకిందులు

|
Google Oneindia TeluguNews

అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పిపోదు అనే సామెత ఈ అనాథ విద్యార్థి విషయంలో అటుఇటైంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టపడి చదివి ఐఐటీ సీటు సాధించినా.. దురదృష్టవశాత్తూ కంప్యూటర్ లో చిన్న క్లిక్ నొక్కి తన కలకు దూరమయ్యాడు.. కాలేజీవాళ్లు కాదు పొమ్మని తరిమేస్తే.. నెలలపాటు న్యాయపోరాటం చేశాడు.. చివరికిప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఆ విద్యార్థిని కరుణించింది.. కానీ, ఐఐటీ వరమిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది..

RRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామRRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ

ఆ విద్యార్థికి సీటివ్వండి..

ఆ విద్యార్థికి సీటివ్వండి..

ఐఐటీలో చేరేందుకు అన్ని అర్హతలు ఉండికూడా, చిన్న పొరపాటు కారణంగా సీటు కోల్పోయిన అనాథ విద్యార్థి వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చిన్నప్పుడే తండ్రికి కోల్పోయి, నాలుగేళ్ల కిందట తల్లిని కూడా కోల్పోయిన ఆగ్రా విద్యార్థి సిద్ధాంత్ బాత్రాకు మధ్యంతర అడ్మిషన్ కల్పించేందుకు అనుమతివ్వాలంటూ బాబే ఐఐటీకి సుప్రీం సూచించింది. జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఆదేశాలిచ్చింది..

చిన్న క్లిక్‌తో సీటు పోయింది..

చిన్న క్లిక్‌తో సీటు పోయింది..

జేఈఈ-2020 పరీక్షల్లో ఆలిండియా 270వ ర్యాంకు సాధించిన తనకు బాంబే ఐఐటీలో సీటు కన్ఫామ్ అయిన కొద్ది రోజుల తర్వాత ఐఐటీ వెబ్ సైట్ లో తప్పు లింక్ క్లిక్ చేసిన కారణంగా సీటు కోల్పోయానని, విద్యా సంవత్సరం కోల్పోకుండా అక్కడే చదువుకునే అవకాశం కల్పించాలని ఆగ్రాకు చెందిన 18ఏళ్ల సిద్ధాంత్ బాత్రా సుప్రంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. సదరు పిటిషన్ ను కోర్టు బుధవారం విచారించింది. బాత్రా తరఫున ప్రముఖ న్యాయవాది ప్రహ్లాద్ పరంజిపే వాదనలు వినిపించారు. చివరికి ఆ విద్యార్థికి మధ్యంతర అడ్మిషన్ కల్పించాలని కోర్టు.. బాంబే ఐఐటీకి సూచించింది. అయితే..

 అదనపు సీటుకు ఐఐటీ అంగీకరిస్తుందా?

అదనపు సీటుకు ఐఐటీ అంగీకరిస్తుందా?

సిద్ధాంత్ బాత్రా అక్టోబర్ 18 న మొదటి కౌన్సిలింగ్ లోనే బాంబే ఐఐటీలో సీటును పొందాడు. అక్టోబర్ 31 న తన రోల్ నంబర్‌ అప్డేషన్ కోసం మళ్లీ లాగిన్ అయ్యాడు. పొరపాటున ‘ఫ్రీజ్' బటన్ నొక్కడంతో సీటు కోల్పోయాడు. నవంబర్ 10 న బాంబే ఐఐటీ ఫైనల్ లిస్టురాగా, అందులో తన పేరు లేకపోవడంతో సిద్ధాంత్ షాక్ కు గురయ్యాడు. సీటును ఉపసంహరించుకున్నట్లుగా లేఖ కూడా వచ్చింది. క్లిక్ తో కోల్పోయిన సీటును తిరిగివ్వడం కుదరదని ఐఐటీ అధికారులు చెప్పడంతో సిద్ధాంత్.. బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. సీటు కల్పించాలని హైకోర్టు చెప్పగా అందుకు ఐఐటీ నిరాకరించింది. క్యాన్సిలేషన్ లెటర్ ను రద్దు చేసే అధికారం తమకు లేదని, సీట్లు నిండిన కారణంగా వచ్చే ఏడాది జేఈఈ రాస్తే అభ్యర్థనను పరిశీలిస్తామని బాంబే ఐఐటీ రిజిస్ట్రార్ ప్రేమ్ కుమార్ హైకోర్టుకు విన్నవించారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే బాత్రాకు సీటివ్వాలని సూచించగా, అదనపు సీటు క్రియేట్ చేసేందుకు ఐఐటీ అంగీకరిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

టిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూటిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూ

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/while-ap-govt-is-supporting-bharat-bandh-mansas-sanchaita-gajapathi-stands-with-pm-modi-282922.html

English summary
The Supreme Court Wednesday came to the rescue of an 18-year-old student by directing the IIT Bombay to grant interim admission to him in an engineering course after he inadvertently lost his seat by clicking on a wrong link in the online admission process. Siddhant Batra, who hails from Agra, had lost his seat for the four-year electrical engineering course in the prestigious IIT Bombay after he "inadvertently" clicked on a "wrong" link which was meant to withdraw from the process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X