
నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఫైర్-దేశాన్ని తగలబెట్టాలనుకున్నారా-దేశాన్ని క్షమాపణ కోరమని ఆదేశం
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకుని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మపై ఇవాళ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాన్ని తగలబెట్టాలనుకున్నారా అని ఆమెను ప్రశ్నించింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మహ్మద్
ప్రవక్తపై
నుపుర్
శర్మ
చేసిన
వ్యాఖ్యలతో
దేశవ్యాప్తంగా
ఉద్రిక్తతలు
చోటు
చేసుకున్న
నేపథ్యంలో
వీటిపై
దాఖలైన
పిటిషన్లపై
ఇవాళ
సుప్రీంకోర్టు
విచారణ
చేపట్టింది.
దీనికి
బాధ్యత
వహిస్తూ
సస్పెండ్
అయిన
బీజేపీ
నాయకురాలు
నుపుర్
శర్మను
సుప్రీంకోర్టు
తప్పుబట్టింది.
ఆమె
వ్యాఖ్యల
ప్రభావం
దేశవ్యాప్తంగా
ఏ
స్ధాయిలో
ఉందో
సుప్రీంకోర్టు
గుర్తుచేసింది.
తద్వారా
ఆమె
చేసిన
తప్పేంటే
ఆమెకు
మరోసారి
గుర్తుచేసింది.

దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆదేశం
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో ఈ మొత్తం వివాదానికి కారణమైన నుపుర్ శర్మ మొత్తం దేశానికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. "దేశమంతటా భావోద్వేగాలను రగిలించిన తీరు, దేశంలో జరుగుతున్న వాటికి ఒక్క మహిళదే బాధ్యత" అని న్యాయమూర్తులు అన్నారు. "ఆమె ఎలా రెచ్చగొట్టారు అనే చర్చను తాము చూశామని, కానీ ఆమె ఇదంతా మాట్లాడిన విధానం తరువాత ఆమె ఒక లాయర్ అని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలిని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇవాళ నుపుర్ శర్మ కేసులో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె తరఫున లాయర్ నుపుర్ పేరును పిటిషన్ లో ప్రస్తావించకపోవడానికి ఆమెకు వస్తున్న బెదిరింపులే కారణమని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఆమెకు బెదిరింపులు వస్తున్నాయా, బెదిరింపులకు ఆమె కారణమైందా అని ప్రశ్నించింది. అలాగే నుపుర్ శర్మ అందరి విషయంలోనూ సమానత్వం పాటించాలని సుప్రీంకోర్టును కోరగా. మీరు ఇతరులపై కేసులు పెట్టినప్పుడు వెంటనే చర్యలుంటాయి. కానీ ఇతరులు మీపై కేసులు పెట్టినప్పుడు మాత్రం ఎలాంటి కేసులు ఉండవా అని ప్రశ్నించింది. తద్వారా ఆమె వ్యాఖ్యలు తన మొండి, అహంకార స్వభావానికి నిదర్శనంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆమె ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే.. తనకు అధికారం ఉందని భావించి, దేశంలోని చట్టాన్ని గౌరవించకుండా ఏదైనా ప్రకటన చేయగలరా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చిందని లాయర్ చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఆమెపై కూడా కేసు పెట్టాలి కదా అని అడిగింది. అలాగే నుపుర్ లాయర్ ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ మాట్లాడే హక్కుందన్న వాదనపై సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలో గడ్డిపెరిగే హక్కుంది గాడిదకు దాన్ని తినే హక్కు కూడా ఉందని చురకలు అంటించింది.