వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి సుప్రీం మొట్టికాయలు: జాగ్రత్తగా వ్యవహరించాలి: పరువునష్టం కేసు కొట్టివేత..!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయితే, ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద మాత్రం సుప్రీం మొట్టికాయలు వేసింది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తిగా.. జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి చౌకీదార్‌ చోర్‌ హై అంటూ వ్యాఖ్యానించడం.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా కీలక కేసుల పరిష్కారంలో భాగంగా.. సుప్రీం కోర్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యల వ్యాజ్యంపైనా తీర్పు ఇచ్చింది. అందులో రాహుల్ మీద ఎటువంటి చర్యల దిశగా నిర్ణయం లేకపోయినా.. ఒకింత ఆగ్రహంతో సుప్రీం సూచనలు చేసింది.

కీలక తీర్పులు: రఫేల్, రాహుల్ గాంధీ ధిక్కార కేసు: పూర్తి వివరాలుకీలక తీర్పులు: రఫేల్, రాహుల్ గాంధీ ధిక్కార కేసు: పూర్తి వివరాలు

రాహుల్ పైన ఆగ్రహం..అయినా.

రాహుల్ పైన ఆగ్రహం..అయినా.

సుప్రీం కోర్టు ఒకే రోజు మూడు కీలక కేసుల్లో తీర్పు ఇచ్చింది. అందులో ఒకటైన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..కోర్టు ధిక్కరణ అంశం పైన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి చౌకీదార్‌ చోర్‌ హై అంటూ వ్యాఖ్యానించడం.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం

రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం

రాఫెల్ వ్యవహారంలో చౌకీ దార్‌ చోర్‌ వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ తమకు ఆపాదించడం దురదృష్టకరమనీ.. ఆయన భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ న్యాయస్థానం సూచించింది. ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. ఆయనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేసింది. కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికి వస్తాయంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీన పైన విచారించిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీంతో..రాహుల్ కు పెద్ద ఊరట లభించినట్లైంది.

 రాహుల్ ప్రచారం చేసిన రఫెల్ పైనా..

రాహుల్ ప్రచారం చేసిన రఫెల్ పైనా..

గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ అధినేతగా వ్యవహరించిన రాహుల్ గాంధీ రఫెల్ అంశం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యం గా చేసుకొని ఆరోపణలు గుప్పించారు. గతంలోనే దీని పైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింవి. అయితే, రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది.

 రాఫెల్ ఒప్పందానికి సుప్రీం సానుకూలంగా

రాఫెల్ ఒప్పందానికి సుప్రీం సానుకూలంగా

రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించిన తీర్పు పైన ఈ రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Supreme Court closes a contempt plea filed by BJP MP Meenakshi Lekhi against Congress leader Rahul Gandhi for wrongly attributing to the court his chowkidar chor hai slogan against Prime Minister Narendra Modi in the Rafale case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X