• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు ఎదురుదెబ్బ.. కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేల్చిన సుప్రీంధర్మాసనం

|

సుప్రీంకోర్టులో నేడు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చింది సుప్రీం ధర్మాసనం . 2020 జూన్ 27 మరియు 29 తేదీలలో వరుసగా రెండు వివాదాస్పద ట్వీట్ల ద్వారా ప్రస్తుత సిజెఐ ఎస్ ఎ బోబ్డే మరియు గతంలో పని చేసిన నాలుగు సిజెఐలకు వ్యతిరేకంగా ఆయన చేసిన 'ధిక్కార మరియు పరువు నష్టం' వ్యాఖ్యలను, సోషల్ మీడియా ట్వీట్లను సుమోటోగా తీసుకుంది సుప్రీం కోర్టు.

ప్రశాంత్ భూషణ్‌పై జూలై 22 న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కార నోటీసు

ప్రశాంత్ భూషణ్‌పై జూలై 22 న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కార నోటీసు

భూషణ్‌ను దోషిగా ప్రకటించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో వాదనలు విన్న తర్వాత ఆగస్టు 20 న శిక్షను ప్రకటిస్తామని చెప్పారు.

ప్రశాంత్ భూషణ్‌పై జూలై 22 న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఆ సమయంలో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సీజేఐలకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు న్యాయపాలనను అపఖ్యాతిలోకి తెచ్చాయని మరియు భారత అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని ,అధికారాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది.

ప్రశాంత్ భూషణ్ అసలు ఏం చేశారంటే

ప్రశాంత్ భూషణ్ అసలు ఏం చేశారంటే

జూన్ 29 న హార్డ్‌లీ డేవిడ్సన్ బైక్‌పై కూర్చున్న సిజెఐ బొబ్డే ఫోటోను ప్రస్తావిస్తూ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు, సిజెఐ రాజ్ భవన్ నాగ్‌పూర్‌లో బిజెపి నాయకుడికి చెందిన 50 లక్షల మోటారుసైకిల్‌ను హెల్మెట్, మాస్క్ లేకుండా నడుపుతున్నారు. లాక్ డౌన్ సమయంలో సామాన్యులకు సుప్రీం కోర్టులో న్యాయం పొందే ప్రాథమిక హక్కును నిరాకరించి, బీజేపీ నాయకుడి మోటార్ వాహనం నడుపుతున్నారని వివాదాస్పద ట్వీట్ చేశారు.

భూషణ్ ట్వీట్ వైరల్ .. వివరణ ఇచ్చిన చీఫ్ జస్టిస్ బొబ్డే

భూషణ్ ట్వీట్ వైరల్ .. వివరణ ఇచ్చిన చీఫ్ జస్టిస్ బొబ్డే

భూషణ్ ట్వీట్ వైరల్ కావడంతో, చీఫ్ జస్టిస్ బొబ్డే కార్యాలయం దీనికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది . సిజెఐ పదవీ విరమణ తర్వాత ఆ హార్లే డేవిడ్సన్ బైకులలో ఒకదాన్ని కొనాలని అనుకున్నారని, అందుకు ప్రస్తుతం ఉన్న నాగ్‌పూర్‌లోని ఒక డీలర్‌ను తనకు చూపించమని కోరినట్లు వివరణ ఇవ్వవలసి వచ్చింది. డీలర్ బైక్‌ను పంపగా సిజెఐ వాహనం నడపకుండా దానిని పరిశీలించారని ,అది ఎవరికి చెందినదో తమకు తెలియదని చెప్పారు.

 సుప్రీంకోర్టులో గతంలో పనిచేసిన సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు

సుప్రీంకోర్టులో గతంలో పనిచేసిన సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు

అంతేకాదు జూన్ 27 నాటి ట్వీట్ లో భవిష్యత్తులో చరిత్రకారులు గత ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా నాశనమైందో చూడటానికి ఈ విధ్వంసంలో సుప్రీంకోర్టు పాత్రను మరియు ముఖ్యంగా చివరి నలుగురు సీజేఐల పాత్రను చూడొచ్చు అని మరో వివాదం రేపారు . దీంతో సీరియస్ గా తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఆయనను తన ట్వీట్లపై వివరణ కోరింది. భూషణ్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

  Sushant Singh Rajput దేహం సీలింగ్‌కు వేలాడలేదు.. ముమ్మాటికి హత్యే.. సీఎం కొడుకు హస్తం? -వికాస్ సింగ్
  మొదటిసారి ఆయనను దోషిగా తేల్చిన ధర్మాసనం ... శిక్షపై 20న వాదనలు

  మొదటిసారి ఆయనను దోషిగా తేల్చిన ధర్మాసనం ... శిక్షపై 20న వాదనలు

  సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, భూషణ్ తరఫున వాదించేటప్పుడు, ట్వీట్లను సరైన దృక్పథంలో చూడాలని మరియు న్యాయవ్యవస్థ యొక్క అభివృద్దిని లక్ష్యంగా చేసుకుని న్యాయమైన విమర్శగా చూడాలని కోర్టును కోరారు. గత కొన్నేళ్లుగా ప్రశాంత్ భూషణ్ తన సోషల్ మీడియా పోస్టుల కోసం కోర్టు విచారణల సందర్భంగా వివిధ న్యాయమూర్తుల నిర్ణయాలపై ధిక్కార వ్యాఖ్యలు చేశారు. పాలనలో ఉన్నప్పుడు న్యాయమూర్తులపై అభియోగాలు మోపడం సమంజసం కాదని , ఒక తీర్పును విమర్శించవచ్చు కాని న్యాయమూర్తిని కాదు అని పేర్కొన్న ధర్మాసనం అతడ్ని దోషిగా తేల్చింది.ప్రశాంత్ భూషణ్‌కు శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటామ‌ని తెలిపింది త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం.

  English summary
  The Supreme Court on Friday held noted activist lawyer Prashant Bhushan guilty of contempt of court. This was for his 'contemptuous and defamatory' remarks against present CJI S A Bobde and past four CJIs through two controversial tweets on June 27 and 29, 2020 respectively. SC had taken suo motu cognizance of the tweets. Pronouncing Bhushan guilty, a bench headed by Justice Arun Mishra said quantum of sentence/punishment will be pronounced on August 20 after hearing of arguments in this regard.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X