వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘క్రిమినల్’ ప్రజాప్రతినిధులపై విచారణ: తేల్చేసిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. 2018 మార్చి నుంచి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణ ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టుల సూచనల మేరకు ఆయా రాష్ట్రాలు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం రూ.7.8 కోట్లు విడుదల చేయాలని ఆదేశించింది.

రెండు నెలల్లో ప్రజా ప్రతినిధుల(ఎంపీలు, ఎమ్మెల్యేలు)పై క్రిమినల్‌ కేసుల వివరాల నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. మొత్తం 12 రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

Supreme Court directs govt to allocate funds for special courts to try lawmakers

ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటుచేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించిన‌ విషయం తెలిసిందే.

తీవ్ర నేరాలకు పాల్పడి, శిక్షపడిన ప్రజాప్రతినిధులు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తన స్పందనను తెలియజేసింది. కాగా,
ముందుగా 12 చోట్ల ఇలాంటి కోర్టులు నెలకొల్పుతామని పేర్కొంటూ 14 పేజీల ప్రమాణ పత్రాన్ని మంగళవారం దాఖలు చేసింది.

English summary
The Supreme Court today directed the Centre to proportionally allocate Rs. 7.8 crore, earmarked for setting up 12 special courts to deal with cases involving politicians, to the concerned states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X