వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ ఆత్మహత్యలపై పిటిషన్ కొట్టివేసిన సుప్రిం కోర్టు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఇంటర్‌మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రిం కోర్టు నిరాకరించింది. తెలంగాణ ఇంటర్‌బోర్డు తప్పిదాలతో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు గురైన నేపథ్యంలో బాలల హక్కుల సంఘం సుప్రిం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక తెప్పించుకుని విచారణ చేపట్టాలని కోరడంతో పాటు భవిష్యత్ ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కోన్నారు. వారి ఆత్మహత్యలకు బోర్డు తప్పిదాలే ప్రధాన కారణమంటూ పిటిషన్‌లో పేర్కోన్నారు.

అయితే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర హైకోర్టు కూడ విచారణ జరిపింది. ఈనేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. మరోవైపు దీనిపై ఇప్పటికే కొండలరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ కొట్టివేసినట్టు ధర్మాసనం పేర్కోంది. ప్రధానంగా విద్యార్థుల ఆత్మహత్యలకు బోర్డు ఫలితాలే కారణమని ఏకిభవించలేమంటూ కోర్టు స్పష్టం చేసింది.

Supreme Court dismisses inter suicides petition

గతంలో కూడ ఇంటర్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా జరగడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తప్పులు చేసిన ఇంటర్‌ బోర్డు సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు, న్యాయవాది రాపోలు భాస్కర్‌ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

అయితే వారి ఆత్మహత్యలకు ఇంటర్‌ ఫలితాలకు సంబంధం లేదని, పిటిషనర్‌ కోరినట్లుగా వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించే ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఇంటర్‌ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంలోనూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది.ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు రెండు పిటిషన్లను తోసిపుచ్చింది.

English summary
The Supreme Court has dismissed to hear the petition filed by children rights commssion on the Telangana Intermediate Students suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X