వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ వీడియోలపై సుప్రీం: ఆన్‌లైన్‌ పోర్టల్‌, హాట్‌లైన్‌ ఏర్పాటుకు ఆదేశం..

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవుతున్న అశ్లీల వీడియోలను సుప్రీం తీవ్రంగా పరిగణిస్తోంది. వాటికి వ్యతిరేకంగా చేసే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌, హాట్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా న్యా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవుతున్న అశ్లీల వీడియోలను సుప్రీం తీవ్రంగా పరిగణిస్తోంది. వాటికి వ్యతిరేకంగా చేసే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌, హాట్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ యు యు లలిత్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలకు సంబంధించి గతంలో కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సమర్పించిన పలు ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court to government: Set up hotline to check online child porn

కమిటీ ప్రతిపాదనలను వీలైనంత త్వరగా అమలులోకి తీసుకురావాల్సిందిగా కోరింది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూ, ఫేస్‌బుక్‌ సంస్థలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి ఈ నివేదికను రూపొందించారు. ఈ కమిటీకి సమాచార, ప్రచారశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు.

కమిటీ రూపొందించిన మొత్తం 11 ప్రతిపాదనలను న్యాయస్థానం ముందుంచారు. కాగా, కమిటీ నివేదిక మేరకు ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజిన్స్‌, సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా కొన్ని 'కీ' వర్డ్స్ సేకరించనున్నాయి. ఆపై వాటిని బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంటారు. అశ్లీల వీడియోలు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ కాకుండా ఉండేందుకు అవసరమైతే సీబీఐ సహాయం కూడా తీసుకోవాల్సిందిగా న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. '

English summary
To curb circulation of child pornography and rape videos on the internet, the Supreme Court has asked the central government to create an online portal and hotline number where anonymous complaints could be filed against those responsible for uploading such offensive videos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X