వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నేడే...మరో ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:అర్ధరాత్రి వేళ తనను సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
సిబిఐలో వరుసగా చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు సిబిఐ ఉదంతంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీబీఐ డైరెక్టర్‌గా వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా అస్థానా ను వారిని పదవుల నుంచి తొలగించలేదని...వారు తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని సీబీఐ అధికారిక ప్రకటన చేసింది. సిబిఐకి కొత్తగా నియమితులైన నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలే అప్పగించామని, హోదా ఇవ్వలేదంటూ సిబిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. వివిధ వరుస పరిణామాల నేపథ్యంలో సిబిఐ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

అలోక్ వర్మ పిటిషన్...విచారణ నేడే

అలోక్ వర్మ పిటిషన్...విచారణ నేడే

అర్థరాత్రివేళ తనను విధుల నుంచి బలవంతంగా తప్పించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో అలోక్ వర్మను అర్థరాత్రి సెలవుపై పంపడంపై సుప్రీం కోర్టులో కేంద్రం ఏమని వాదిస్తుంది...ఎలా సమర్థించుకుంటుందనేది ఉత్కంఠ భరితంగా మారింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ మీద ప్రత్యేక డైరెక్టర్‌ అస్థానా చేసిన ఆరోపణల ఆధారంగా సీవీసీ సూచనల మేరకు తాము వర్మను సెలవుపై వెళ్లమని కోరామని ప్రభుత్వం చేసే వాదన సుప్రీంకోర్టులో చెల్లుతుందా?...అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిక్కుల్లో చిదంబరం: ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిద్దూ పేరు ఛార్జిషీట్లో చేర్చిన ఈడీచిక్కుల్లో చిదంబరం: ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిద్దూ పేరు ఛార్జిషీట్లో చేర్చిన ఈడీ

కేంద్రం వాదన...నిలుస్తుందా?

కేంద్రం వాదన...నిలుస్తుందా?

అలోక్‌ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం 1997 నాటి సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమైనదని, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీసేదని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలోక్‌ వర్మను పక్కకు తప్పించే విషయంలో కొలీజియం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున...ఇదే విషయం కోర్టులో ప్రస్తావనకు వస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదని వారు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ మీద ప్రత్యేక డైరెక్టర్‌ అస్థానా చేసిన ఆరోపణల ఆధారంగా సీవీసీ సూచనల మేరకు తాము వర్మను సెలవుపై వెళ్లమని కోరామని ప్రభుత్వం చేసే వాదన చెల్లుకతుందా?...అనే విషయమై భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకేనా...సిబిఐ ప్రకటన

అందుకేనా...సిబిఐ ప్రకటన

ఈ నేపథ్యంలోనే అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి, ప్రత్యేక డైరెక్టర్‌గా అస్థానాను తొలగించలేదని సిబిఐ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తమకు ఇప్పటికీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మేనని సిబిఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. స్పెషల్‌ డైరెక్టర్‌ అస్థానా కూడా కొనసాగుతారన్నారు. ఎం.నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్‌గా మాత్రమే విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. వారిని పదవుల నుంచి తొలగించలేదని, కొత్తగా నియమితులైన నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలే అప్పగించామని, హోదా ఇవ్వలేదంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

 మరోవైపు...ఆ కలకలం

మరోవైపు...ఆ కలకలం

ఇదిలావుంటే గురువారం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ ఇంటి వద్ద చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర కలకలం రేగింది. అలోక్ వర్మ నివాసం వద్ద నలుగురు అగంతకులు తచ్చాడుతూ కనిపించారని, వారు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన సిబ్బందేననే ఆరోపణలు పెను దుమారానికి దారితీసాయి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించి, వదిలేశారు. రోజువారీ విధుల్లో భాగంగానే ఐబీ సిబ్బంది అక్కడ ఉన్నారని కేంద్ర హోంశాఖ అధికారులు ప్రకటించారు. ఆలోక్‌ వర్మ నివాసం వెలుపల నలుగురు వ్యక్తులు ఒక కారులో ఉండి పరిసరాలను గమనిస్తున్నారని...వారిని వర్మ భద్రత సిబ్బంది పట్టుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించారని...వారు ఐబీ సిబ్బందని తెలిసి ప్రశ్నించి, వదిలేశామని అని పోలీసులు తెలిపారని సమాచారం.దీంతో సిబిఐకి సంబంధించి శుక్రవారం అతి కీలక పరిణామలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
New Delhi: The Central Bureau of Investigation chief Alok Verma's petition, challenging the government's decision to strip him of his powers, will be heard by the Supreme Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X