వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూవివాద పిటిషన్‌ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ:అయోధ్యకు సంబంధించి మిగులు భూమిని తిరిగి ఇచ్చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఛీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసం ఈ పిటిషన్‌ను విచారణ చేయనుంది. అంతకుముందు 1/3వ వంతు భూమిని హిందువులకు, ముస్లింలకు, శ్రీరాముడికి కేటాయిస్తూ అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాలుచేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేంద్రం.

అయోధ్యలో మిగులు భూమిపై కేంద్రం పిటిషన్ దాఖలు చేసిన వెంటనే న్యాయవాది శిశిర్ చతుర్వేదితో పాటు మరో ఏడుగురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య చట్టం 1993 ప్రకారం భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తీసుకోవడానికి వీలు లేదు. ఈ పిటిషన్ విచారణకు రాగానే దీన్ని కూడా అయోధ్య బెంచ్‌కు కేటాయిస్తున్నట్లు జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇదిలా ఉంటే న్యాయవాది శిశిర్ చతుర్వేది తన పిటిషన్‌లో కేంద్రం 1993లో 67 ఎకరాలు అయోధ్య భూమిని తీసుకుందని పేర్కొన్నారు. ఇక వివాదంలో ఉన్నది కేవలం 0.313 ఎకరా భూమి మాత్రమే అని తెలిపారు.ఈ పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది. ఇదే ధర్మాసనం రామజన్మభూమికి సంబంధించి 2.77 ఎకరాలుపై విచారణ చేయనుంది.

Supreme Court to hear plea on land in Ayodhya

ఇదిలా ఉంటే వివాదంగా మారిన అయోధ్యలోని స్థలం చారిత్రక కట్టడం కింద ఉన్నట్లు ఏ చట్లం చేయబడలేదు. అయోధ్యలో వివాదంగా మారిన ఈ స్థలం ఓ పుణ్యక్షేత్రంగా అంతా భావిస్తారు. చట్టం తీసుకొచ్చే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది తప్ప చట్టం చేయాలని చెప్పి బలవంతం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు.హిందువులు ఇక్కడ పూజలు , హారితి ఇవ్వొచ్చు.అయతే కేంద్రానికి కానీ, రాష్ట్రానికి కానీ పూజలు నిలిపివేయాల్సిందిగా చెప్పే అధికారం లేదు.

English summary
The Chief Justice of India Ranjan Gogoi on Friday directed the petition seeking return of excess land acquired in Ayodhya for hearing by a five judge Constitution bench constituted to hear the title disputes against the Allahabad High Court verdict awarding one third each to Hindus, Muslims and the Lord Ram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X