వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని నిషేధిస్తూ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని నిరసిస్తూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు, విభిన్న వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. అయితే దీనిని నిరసిస్తూ మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం .. బుధవారం విచారిస్తామని పేర్కొంది.

సరికాదు ..

సరికాదు ..

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సలహాను పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్రపతి 370 గెజిట్ విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం .. రాష్ట్రపతి ఆమోదం తెలుపడం గంటల్లో జరిగిపోయాయని గుర్తుచేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం .. బుధవారం విచారిస్తామని పేర్కొంది.

ఆమోదముద్ర ..

ఆమోదముద్ర ..

జమ్ము కశ్మీర్ విభజన బిల్లును కూడా కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేస్తుందనే అంశం సర్వత్రా చర్చకు దారితీసింది. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేస్తుందా ? లేదా కేంద్రప్రభుత్వ అభిప్రాయం అడుగుతుందా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. దీంతోపాటు ఇప్పటివరకు ఉన్న విద్యాహక్కు, రాయితీలను, ప్రత్యేక రైట్లను కోల్పోతుంది. కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీతో కూడి కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్‌ను విభజించారు.

 లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం ఇలా

లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం ఇలా

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. వెంటనే రాజ్యసభలో 4 బిల్లులను ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
నిన్నపెద్దల సభలో గట్టెక్కిన బిల్లు .. ఇవాళ లోక్‌సభలో సునాయసంగా ఆమోదం పొందింది. బీజేపీకి 300 పైచిలుకు సభ్యులు ఉండగా .. భాగస్వామ్య పక్షాల మద్దతుతో సులువుగా ఆమోదం లభించింది. కశ్మీర్ విభజన బిల్లును లోక్ సభలో కూడా డివిజన్ పద్ధతిలో లెక్కించారు. బిల్లుకు అనుకూలంగా 367 మంది సభ్యులు మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 67 మంది సభ్యులు ఓటేశారు. దీంతో కశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడమే మిగిలిపోయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ గెజిట్ విడుదల చేయడంతో కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయే ప్రక్రియ పూర్తవుతుంది. కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. కశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం కాగా .. లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. దీంతోపాటు అప్పటివరకు ఉన్న రిజర్వేషన్ బిల్లు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు అమిత్ షా. కశ్మీర్ విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో వర్తించే రిజర్వేషన్లు వారికి వర్తిస్తాయని సభకు తెలిపారు అమిత్ షా.

English summary
Article 370 has been canceled by the central government banning autonomy for Jammu and Kashmir. There is a lot of criticism in protest. There is some opposition from the opposition and the different factions. However, the Supreme Court on Tuesday filed a petition in the Supreme Court challenging this. The bench, which has taken up the petition for hearing, said it would hear on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X