వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటల్లో బలపరీక్ష జరపాలి : గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారు : సుప్రీంలో మహా వాదనలు..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాలు..అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం వ్యవహారం పైన సుప్రీంలో వాదనలు కొనసాగుతున్నాయి. శివసేన..ఎన్సీపీ..కాంగ్రెస్ తరపున కపిల్ సిబలా్.. సింఘ్వీ..వేణు గోపాల్ వాదిస్తున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారని..అది ఎమెర్జెన్సీ విధించిన సమయంలోనే సాధ్యం అవుతుందని కపిల్ సిబల్ వాదించారు.

బీజేపీకి బలం ఉంటే వెంటనే బల పరీక్ష ఎదర్కోవాలని..అందుకు వారికి 24 గంటల సమయం ఇవ్వాలని ప్రతిపాదించారు. తమ కూటిమికి మెజార్టీ ఉందని..వారు విఫలమైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉందని కూటమి తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఎన్నికల ముందు కుదర్చుకున్న పొత్తు ఫలితాల తరువాత విఛ్చిన్నమైందని..దీంతో..ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకున్న మూడు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నాయని కోర్టుకు వివరించారు.

గవర్నర్ ఎవరి దర్శకత్వంలో పని చేస్తున్నారు

గవర్నర్ ఎవరి దర్శకత్వంలో పని చేస్తున్నారు

మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర సూచనలతో పని చేస్తున్నారని కపిల్ సిబల్ వాదించారు. అర్దరాత్రి రాష్టపతి పాలన ఎత్తివేయటం ఏంటని ప్రశ్నించారు. మెజార్టీ లేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశం లేకుండా రాష్ట్రపతి పాలన ఎత్తివేయటం ఏంటని నిలదీసారు. కేంద్రం ఆదేశాల మేరకే గవర్నర్ వ్యవహరించారని పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి 7 గంటల తరువాత రాజకీయం మొదలు పెట్టారని శనివారం ఉదయం వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని కోర్టుకు నివేదించారు. ఉదయాన్నే సీఎం ప్రమాణ స్వీకారం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. వారికి బలం ఉంటే వెంటనే బల పరీక్ష నిర్వహించే ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్ధించారు.

24 గంటల్లోగా బలం నిరూపించుకొనేలా

24 గంటల్లోగా బలం నిరూపించుకొనేలా

ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కి కావాల్సిన సంఖ్యా బలం లేదని..ఉంటే 24 గంటల్లోగా బలం నిరూపించుకోవాల్సిందా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం ను కోరారు. తమ మూడు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉందని కోర్టుకు నివేదించారు. కనీసం గవర్నర్ నుండి లేఖ కూడా లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

వారు 24 గంటల్లో మెజార్టీ నిరూపించోలేని పరిస్థితి ఉంటే..తమ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. అదే విధంగా అజిత్ పవార్ కు ఎన్సీపీ నుండి ఏ ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేదని కూటమి న్యాయవాదులు సుప్రీం కు నివేదించారు.

హైకోర్టును ఆశ్రయించకుండానే..

హైకోర్టును ఆశ్రయించకుండానే..

దీని పైన బీజేపీ తరపున వాదనలు వినిపిస్తున్న ముఖుల్ రోహిత్గి అసలు ఈ వ్యవహారం పైన తొలుత మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాల్సి ఉన్నా..అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నేరుగా సుప్రీం వద్దకు ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అయితే, దీనికి న్యాయమూర్తి ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు తాము వాదనలు వింటున్నామని స్పష్టం చేసారు.

అజిత్ పవార్ కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఎలా ఇస్తారని కాంగ్రెస్ తరపు న్యాయవాది సింఘ్వీ ప్రశ్నించారు. కూటమి న్యాయవాదులు ముగ్గురూ..బీజేపీకి 24 గంటల సమయం ఇవ్వాలని..ఆ సమయంలో బలం నిరూపించుకోక పోతే వెంటనే తమ కూటిమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంను అభ్యర్ధించారు.

English summary
Supreme Court hearing underway on Sena NCP Cong plea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X