వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథువా రేప్ కేసు: మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి: సుప్రీం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కథువా అత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్. రాజావత్‌కు కూడ రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

కథువాలో ఎనిమిదేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో తనకు రక్షణ కల్పించాలని మృతురాలి తండ్రి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సోమవారం నాడు నోటీసులు ఇచ్చింది.

Supreme Court issues notice to J&K govt on transfer plea

మృతురాలి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వాదిస్తున్న దీపిక అనే న్యాయవాదికి కూడ బెదిరింపులు వస్తున్నట్టు ఆమె మీడియాకు వివరించింది.

ఈ తరుణంలో దీపీకకు కూడ రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కథువా అత్యాచార ఘటనపై జమ్మూలో ఇవాళ విచారణ ప్రారంభమైంది.

ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 28వ తేదికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఎనిమిది మంది నిందితుల్లో ఒక నిందితుడు మైనర్‌. అయితే మైనర్‌ను ఈ కేసులో విడిగా విచారించనున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌కు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.

English summary
meta descriptionHearing began in the Kathua gangrape and murder case today, in which eight accused including a juvenile stand trial. They were held for allegedly gangraping and murdering an 8-year-old girl in January. The girl, belonging to the Bakherwal community, was held captive in a small village temple in Kathua district for a week during which she was sedated and sexually assaulted before being bludgeoned to death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X