వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశా బాలిక కిడ్నాప్, రేప్, హత్య కేసులో సీబీఐకి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుప్రీంకోర్టు

అయిదేళ్ల తన కుమార్తెను అపహరించి, అత్యాచారం చేసి చివరికి హత్య చేసిన కేసును సీబీఐతో విచారణ జరిపించాలని తల్లి సౌదామిని సాహూ చేసిన అభ్యర్థనను బుధవారం సుప్రీం కోర్టు బుధవారం విచారించింది. దీనిపై సీబీఐకి నోటీసు జారీ చేసింది.

తన కుమార్తె అత్యాచారం, హత్య కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ సౌదామిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనపై బదులివ్వాలంటూ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐకి నోటీసు పంపించింది.

బాధితురాలైన మైనర్ బాలిక తరఫున సీనియర్ లాయర్లు మహేశ్ జెఠ్మలాని, రవి శర్మ సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు.

ఈ ఘటన ఒడిశాలోని నయాగఢ్‌లో గత ఏడాది జూలై నెలలో జరిగింది. అయిదేళ్ల తన కుమార్తెపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని సౌదామిని సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 14, 21 అధికరణల కింద రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఆమె 32వ అధికరణం కింద ఈ పిటిషన్ వేశారు.

అత్యాచారం, లైంగిక వేధింపులు

"సామాజికంగా వేధింపులకు, వెలివేతకు గురవడమే కాకుండా, చట్టాన్ని కాపాడాల్సిన సంస్థల నుంచి కూడా కష్టాలు తప్పకపోవడంతో ఆమెకు న్యాయం జరుగుతున్న నమ్మకం పోయింది" అని లాయర్లు మహేశ్ జెఠ్మలాని, రవిశర్మ తమ పిటిషన్లో పేర్కొన్నారు.

గత ఏడాది జూలై 14న తన కుమార్తెను ఇంటివద్ద ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారని, తొమ్మిది రోజుల తరువాత బాలిక ఎముకల ముక్కలను మూటగట్టి తమ ఇంటికి సమీపంలోని చెత్త కుప్ప వద్ద విసిరేశారని పిటిషనర్ తెలిపారు. పోలీసు అధికారులు పిటిషనర్‌ను, వారి కుటుంబ సభ్యులను నేరస్తులుగా చూశారు. వారి పిటిషన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

రాష్ట్ర పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నందున, దీన్ని దర్యాప్తు చేసే బాధ్యతను వారికి అప్పగించకూడదని పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Supreme Court issues notice to CBI in Odisha girl kidnapping, rape and murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X