వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక స్పీకర్‌కు ఝలక్: అనర్హత ఎమ్మెల్యేలపై తేల్చండి: సుప్రీంకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కర్ణాట అసెంబ్లీ స్పీకర్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 21న జరిగే ఉప ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన 17 ఎమ్మెల్యేలు పోటీ చేసే విషయంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది.

అనర్హత, పోటీ విషయంపై స్పష్టతనివ్వాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. తదుపరి వాదనలను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగా, ఆదివారం బీజేపీ నేత, కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక మాట్లాడుతూ.. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేల త్యాగాలకు ప్రతిఫలం దక్కుతుందని, వారి త్యాగాల వల్లే బీఎస్ యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో వెలసిందని అన్నారు.

Supreme Court issues notice to the Karnataka Assembly Speaker

బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆహ్వానించిన అనంతరం అశోక ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తమకు, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఎమ్మెల్యేకీ కి పరిహారం దక్కుతుందని వ్యాఖ్యానించారు. అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు వాదనలు విన్న తర్వాత తీర్పును వెల్లడించనుంది.

కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేయడంతో ప్రజల్లో ఆ ప్రభుత్వంపై నమ్మకం లేదని, కాంగ్రెస్ రాష్ట్రాన్ని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21 పోలింగ్ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలవడనున్నాయి.

English summary
This came a day after the Election Commission on Saturday announced that the by-elections for 15 Assembly constituencies in Karnataka will be held on October 21, while the counting of votes will be held on October 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X