వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రివర్గ ఆమోదం.. 33కు చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇదివరకున్న 30 మంది న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. ఆ మేరకు బుధవారం నాడు సెంట్రల్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరాలు వెల్లడించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India - CJI) తో పాటు 33 మంది న్యాయమూర్తులు ఉంటారని తెలిపారు జవదేకర్. పార్లమెంటులో సదరు బిల్లుకు ఆమోదం లభిస్తే సీజేఐతో పాటు ఆ సంఖ్య 34కు చేరనుంది. అదలావుంటే న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందంటూ గతంలో సుప్రీం కోర్టు పలుమార్లు కేంద్రానికి గుర్తు చేసిన సందర్భాలున్నాయి.

Supreme Court judges from 30 to 33 Centre approves

వాస్తవానికి 1956లో తీసుకొచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి 2009లో సవరణలు తీసుకువచ్చారు. అప్పుడు సీజేఐతో కాకుండా న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 30కి పెంచారు. అదలావుంటే న్యాయమూర్తులను సంఖ్య పెంపునకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కేబినెట్ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

English summary
Central Cabinet approved increasing the number of judges in the supreme court from the present 30 to 33.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X