వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రెస్ మీట్ ఎఫెక్ట్: రంజన్ గగోయ్‌ తదుపరి సీజేఐ కాలేరా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఊహించని విధంగా దేశ చరిత్రలో తొలిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి పలు కీలక విషయాలను పంచుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Recommended Video

చరిత్రలో తొలిసారి... నలుగురు సుప్రీం కోర్టు జడ్జిల ప్రెస్‌మీట్..!

చీకటి రోజు, చిన్న పిల్లల్లా: ఆ నలుగురు జడ్జీలపై విమర్శలు, 'మోడీ చొరవ చూపాలి'చీకటి రోజు, చిన్న పిల్లల్లా: ఆ నలుగురు జడ్జీలపై విమర్శలు, 'మోడీ చొరవ చూపాలి'

అత్యున్నత న్యాయస్థానంలోనే అవాంఛనీయ ఘటనలు చోటు చోటు చేసుకుంటున్నాయని వారు వాపోవడం చర్చనీయాంశంగా మారింది.

 ఆసక్తికరంగా

ఆసక్తికరంగా

సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జాస్తి ఛలమేశ్వర్, రంజన్ గగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు ప్రధాన న్యాయమూర్తి తర్వాత వీరే సీనియర్లుగా ఉన్నారు. వీరే మీడియా ముందుకు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

 విమర్శలు.. మద్దతు

విమర్శలు.. మద్దతు

ఈ నలుగురు న్యాయమూర్తులకు పలువురు రిటైరైన జడ్జీలు మద్దతు పలుకగా, మరికొందరు వీరికి వ్యతిరేకంగా మాట్లాడారు. న్యాయం చేయాల్సిన న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ఏంటని పలువురు తీవ్రంగా స్పందించారు.

 రంజన్ గగోయ్‌పై తీవ్ర ప్రభావం

రంజన్ గగోయ్‌పై తీవ్ర ప్రభావం

కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి దీపక్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసిన ఈ నలుగురిలో జస్టిస్ రంజన్ గగోయ్‌పై తీవ్ర ప్రభావమే పడనున్నట్లు తెలుస్తోంది. దీపక్ మిశ్రా తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవీబాధ్యతలను చేపట్టాల్సిన గగోయ్‌పై.. ఈ మీడియా వ్యవహారం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 దీపక్ మిశ్రా ఏం చేస్తారో?

దీపక్ మిశ్రా ఏం చేస్తారో?

ఎందుకంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత బాధ్యతలను చేపట్టనున్న వారి పేర్లను సీనియార్టీ ప్రకారం రాష్ట్రపతికి అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గగోయ్‌ను కాకుండా మరో సీనియర్ న్యాయమూర్తి పేరును దీపక్ మిశ్రా రాష్ట్రపతి పంపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Justice Ranjan Gogoi is to take over as the next Chief Justice of India (CJI) after justice Dipak Misra retires in October this year. But after Friday’s attack on Misra by a group of four judges, including Gogoi, questions are being asked whether the latter has hurt his prospects of being made the CJI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X