వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి షాక్ ఇచ్చిన రామ్ జఠ్మలానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మాజీ మంత్రి, సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ముందు తాను నరేంద్ర మోడీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదని, ఆయనతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని ప్రకటించారు.

ఎంతో కీలకమైన విజిలెన్స్ శాఖలో అవినీతి చక్రవర్తి కూర్చున్నారని మండిపడ్డారు. విజిలెన్స్ చీఫ్ కమిషనర్ గా(సీవీసీ) కేవీ చౌదరిని నియమించడంతో నరేంద్ర మోడీ మీద ఉన్న గౌరవం పోయిందని అన్నారు. కేవీచౌదరి పెద్ద అవినీతిపరుడని మండిపడ్డారు.

కేవీ. చౌదరి మీద లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయని రామ్ జఠ్మలానీ అంటున్నారు. చౌదరి అవినీతిపై తాను సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఆయన సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. మోడీకి ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఒక లేఖ వ్రాశారు.

Supreme Court lawyer Ram Jethmalani announced his break-up with PM Modi

బీజేపీ సీనియర్ నేతలు చాల మంది మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉండరాదని గతంలో వ్యతిరేకించిన సమయంలో రామ్ జఠ్మలానీ మోడీకి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మోడీ మీద మండిపడటంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.

ఆప్ నుండి ప్రశాంత్ భూషణ్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈయన సుప్రీం కోర్టు న్యాయవాది. కేవీ చౌదరిని విజిలెన్స్ చీఫ్ గా నియమింయడం అవమానకరం అని, తాను సుప్రీం కోర్టులో కేసు వేస్తానని ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు రామ్ జఠ్మలానీ తోడు కావడంతో కేవి చౌదరికి చిక్కులు మొదలైనాయి.

English summary
Now we shall fight out in the Supreme Court and the court of the people of India. My diminishing respect for you ends today," Mr Jethmalani wrote in a letter to Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X