వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Supreme Court Live : సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం- ఇలా చూడొచ్చు...

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయం మొదలైంది. ఇన్నాళ్లూ సుప్రీంకోర్టులో విచారణలు ఎలా సాగుతాయో తెలియని సామాన్యులకు వీటిని పరిచయం చేస్తూ ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. లైవ్ ప్రారంభమైన తర్వాత తొలి విచారణగా ఆర్ధికంగా బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. దీంతో లాయర్లు, పిటిషనర్లతో పాటు సాధారణ పౌరులు కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్ ను తిలకిస్తున్నారు.

ఇవాళ మరో కీలకమైన పిటిషన్ పై రాజ్యంగ ధర్మాసనం చేపట్టే విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య సేవల విభజనపై వివాదంపై దాఖలైన పిటిషన్ పై రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే విచారణ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత మూడు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలు చేపట్టే కేసుల విచారణ వచ్చే 3-4 రోజుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే ఈ లైవ్ స్ట్రీమింగ్ లో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

supreme court live streaming starts today- now you can see live arguments here

సుప్రీంకోర్టు చేపట్టే లైవ్ విచారణల ప్రత్యక్ష ప్రసారానికి పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ విచారణల ప్రత్యక్ష ప్రసారం ఎన్ఐసీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇదే క్రమంలో భవిష్యత్తులో ప్రత్యేక ఓటీటీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టు దూకుడుతో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఓటీటీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. యూట్యూబ్ కాకుండా కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేదుకు తమ సొంత ప్లాట్ ఫామ్ ను తీసుకొస్తామని సీజేఐ యూయూ లలిత్ ఇప్పటికే ప్రకటించారు

లైవ్ చూడాలంటే...

Court1-https://youtube.com/embed/dYorAvbSfzs
Court2-https://youtube.com/embed/jBNVa2rtzrA
Court3-https://youtube.com/embed/-3hbnrj6U0U

#SupremeCourtOfIndia Web link:
https://main.sci.gov.in/display-board

English summary
live streaming of supreme court hearings begins today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X