బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 21వ తేదీ జరగవలసిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో అనర్హత ఎమ్మెల్యేలు తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

విచారణ జరగాలి

విచారణ జరగాలి

గురువారం అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఈ అర్జీ కేసు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ అర్జీ విచారణ ఇంకా క్షుణ్ణంగా విచారణ చెయ్యడానికి అవకాశం కావాలని, అందుకే ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది.

నెల రోజుల సమయం ?

నెల రోజుల సమయం ?

అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ అక్టోబర్ 22వ తేదీ విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ వాయిదా పడటంతో ఉప ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకలో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం కావాలసి ఉంటుంది.

కపిల్ సిబల్ బ్యాటింగ్

కపిల్ సిబల్ బ్యాటింగ్

కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ద్రోహం చేసి బీజేపీతో చేతులు కలిపారని, వారిని అనర్హులను చెయ్యాలని సుప్రీం కోర్టులో మనవి చేశారు. అయితే తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని అనర్హత ఎమ్మెల్యేలు అంటున్నారు.

ఎమ్మెల్యేల ద్రోహం

ఎమ్మెల్యేల ద్రోహం

అనర్హత ఎమ్మెల్యేలు ఇంకా తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని అంటున్నారు, అయితే ఆ పార్టీ ఇచ్చిన విప్ ఎందుకు దిక్కరించారు. ఆ పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదని కపిల్ సిబల్ వాదించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చెయ్యడానికి అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపారని, అందుకే వారిని అనర్హులు చెయ్యాలని కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో మనవి చేశారు.

ఊపిరిపీల్చుకున్న ఎమ్మెల్యేలు

ఊపిరిపీల్చుకున్న ఎమ్మెల్యేలు

కర్ణాటకలో శాసన సభ ఉప ఎన్నికలు తాత్కాలికంగా నిలిపి వేసిన సుప్రీం కోర్టు అర్జీ విచారణ వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అనర్హత ఎమ్మెల్యేలు తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఉప ఎన్నికలు జరగడానికి అవకాశం లేకపోవడంతో అనర్హత ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారు.

అదే భయం

అదే భయం

ఉప ఎన్నికలు జరిగి ఉంటే తాము ఎక్కడ పోటీకి అనర్హులు అవుతామో అంటూ ఇన్ని రోజులు అనర్హత ఎమ్మెల్యేలు టెన్షన్ పడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు కర్ణాటకలో శాసన సభ ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదు.

English summary
Supreme court ordered to stay on 15 constituency assembly by elections of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X