వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రోలో మహిళల ఉచిత ప్రయాణానికి సుప్రిం బ్రేక్..!

|
Google Oneindia TeluguNews

మహిళలకు డిల్లీ మెట్రో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రిం కోర్టు మొట్టి కాయలు వేసింది. అన్ని వయసుల మహిళలకు మెట్రో లో ఉచిత ప్రయాణం ప్రకటించే ప్రపోజల్స్‌ను ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈనేపథ్యంలనే ఉచిత ప్రయాణం అనేది డిల్లీ మెట్రో రైలుకు లాభదాయకం కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రజల డబ్బును సక్రమంగా వినియోగించాలని ప్రభుత్వానికి సూచించింది.

కొద్ది రోజుల్లో డిల్లీ సాధరణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకుని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉచిత మానియాను తెరపైకి తెచ్చాడు. ఇందులో భాగంగానే ఢిల్లీ మెట్రోలో మహిళలను ఉచిత ప్రయాణాన్ని ప్రకటించాడు. దీంతోపాటు 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి ఉచిత విద్యుత్‌ను ప్రకటించాడు. అయితే ఉచిత మెట్రో ప్రయాణంపై సుప్రింకోర్టులో పటిషన్ దాఖలైంది. దీంతో కేసును విచారించిన సుప్రిం కోర్టు తన అభిప్రాయాన్ని వెలువరించింది.

supreme Court questioned the Delhi government to offer free rides on Delhi Metro to women,

ఈ నేపథ్యంలోనే మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం చేపట్టడడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా అన్ని వయస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించడం వల్ల మెట్రో సంస్థకు నష్టాలు వస్తాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగించుకునే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రజలకు ఉచిత నజరాలు ప్రకటించడానికి బదులు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించింది.ఢిల్లీ మెట్రో ఆర్ధిక నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని, దాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించింది.దీంతో కేజ్రీవాల్ ఆశించిన మహిళల ఓట్లకు బ్రేక్ పడనుంది.

English summary
supreme Court on Friday questioned the Delhi government over its proposal to offer free rides on Delhi Metro to women across all age and background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X