వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథువా రేప్ కేసు: సుమోటోగా స్వీకరణకు సుప్రీం ఒకే, మాకు కుల మతాలుండవు; వైద్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

8 ఏళ్ల చిన్నారిపై హిందూ దేవాలయంలో గ్యాంగ్ రేప్...!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని కథువా అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ కేసును తామే స్వయంగా పరిశీలించనున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించింది.ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఉన్నత న్యాయస్థానానికి సమర్పించాలని సుప్రీం కోర్టు కథువా న్యాయవాదులను ఆదేశించింది.

కథువాలో 8 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై చార్జీషీటు దాఖలు చేసేందుకు కూడ స్థానికంగా న్యాయవాదులు అంగీకరించలేదు. అయితే దీనికి సంబంధించి లాయర్లకు నిందితుల నుండి ఏమైనా బెదిరింపులు వచ్చాయా అనే కోణాన్ని కూడ ఉన్నత న్యాయస్థానం పరిశీలించే అవకాశం లేకపోలేదు.

Supreme Court ready to take up Kathua rape incident

కథువాలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఈ కేసు విచారించాలని కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్ , డివై చంద్రఛూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును సుమోటోగా స్వీకరించేందుకు అంగీకరించింది.

ఎనిమిదేళ్ళ బాలికను కొందరు వ్యక్తులు బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ బాలికను హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కథువా రేప్ వ్యాఖ్యలపై పోలీస్ చీఫ్ ఎస్పీ వైద్ ఆందోళన

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన రాజకీయ , మతం రంగు పులుముకోవడంపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్పీ వైద్ ఆందోళన వ్యాక్తం చేశారు. పోలీసులు మతం పరంగా విధులు నిర్వహించరని ఆయన చెప్పారు.

పోలీసులపై తమకు విశ్వాసం లేదని సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన ఘటనపై ఆయన స్పందించారు. స్థానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబుబబా ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది.

English summary
Even as the nation reels in horror at the gangrape and murder of an eight-year-old girl in Kashmir, the Supreme Court (SC) said today it will, of its own accord, examine the horrific Kathua rape incident , provided advocates presented the facts of the case to the court in writing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X