వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ బయోపిక్‌కు లైన్ క్లియర్ స్టే విధించాలన్న పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ బయోపిక్‌కు లైన్ క్లియర్ అయింది. వివేక్ ఒబెరాయ్ నటించిన పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉందంటూ కాంగ్రెస్ కార్యకర్త అమన్ పన్వర్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. సినిమాకు సెన్సార్ బోర్డు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూడిన ధర్మాసనం కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడింది.

Supreme Court Refuses to Stay Release of PM Modi Biopic

<strong>కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా?</strong>కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా?

పీఎం నరేంద్రమోడీ చిత్ర విడుదలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు వదిలేసింది. సినిమా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా ఉందా లేదా అనే విషయాన్ని ఈసీ పరిశీలించిన అనంతరం స్క్రీనింగ్‌కు అనుమతివ్వాలని ఆదేశించింది. పీఎం నరేంద్రమోడీ చిత్రంలో నటించిన వారిలో చాలా మంది బీజేపీకి చెందిన వారని, వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందన్న అంశాన్ని పన్వర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆయన వాదనతో ఏకీభవించని ప్రధాన న్యాయమూర్తి ఈ అంశం వ్యక్తిగతమైందని అన్నారు. ఇలాంటి అంశాల వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని అభిప్రాయపడ్డారు.

English summary
Describing it a matter to be decided by the Election Commission, the Supreme Court on Tuesday dismissed a petition by a Congress activist, seeking to stay release of the Vivek Oberoi-starrer Modi biopic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X