వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహిళల ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు చుద్దాం అంటూ వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలు కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేయగా .. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.

నిషేధం ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించింది. మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి నో చెప్పింది. ఒకవేళ మహిళలు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పరిశీలిద్దాం అంటూ ముక్తాయించింది. అఖిల భారత హిందూ మహాసభ కేరళ అధ్యక్షుడు స్వామి దత్తాత్రేయ సాయి స్వరూప్ నాత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ముస్లిం మహిళలను మసీదుల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ఇదివరకు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ చుక్కెదురు అయ్యింది. పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మెట్కెక్కారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. అంతేకాదు కేరళ హైకోర్టు ఎందుకు పిటిషన్ కొట్టివేసిందో తెలుసుకోవాలని సూచించారు.

Supreme Court rejects plea seeking womens entry into mosques

సమన్యాయం కాదా ..?
మసీదుల్లో ముస్లిం మహిళలకు ఎందుకు అనుమతించరని పిటిషనర్ ప్రశ్నించారు. సమన్యాయ పాలన అన్నప్పుడు ప్రార్థనలు చేసే చోట వివక్ష ఏంటని ప్రశ్నించారు. పురుషులకు, మహిళలకు మధ్య వివక్ష ఏంటని నిలదీశారు. ఆధునిక సమాజంలో ముస్లిం మహిళల హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని వాదనలు వినిపించారు. దీంతోపాటు ముస్లిం మహిళలు బురఖాను కూడా నిషేధించాలని కోరారు.

English summary
the Supreme Court on Monday rejected the Akhila Bharatha Hindu Mahasabha's plea that Muslim women should be allowed to enter mosques.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X