వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య, సుప్రీం తీర్పుపై నితీష్; కేజ్రీవాల్, కమల్ నాథ్ కామెంట్

|
Google Oneindia TeluguNews

దశాబ్దాల వివాదానికి ఫుల్‌స్టాప్ పడడంతో...ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయోధ్య తీర్పుపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీర్పును స్వాగతించింది. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామని తెలిపింది. రాజ్యంగ స్పూర్తితో అన్ని వర్గాలు సామరస్యంగా ఉండాలని, శాంతి సామరస్యాలతో మెలగాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తీర్పును మతాలకు అతీతంగా చూడవద్దని చెప్పారు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయోతర సీఎంలు సైతం సుప్రిం తీర్పుపై సానూకులంగా స్పందించారు.

 అయోధ్య రాముడిదే..! సుప్రీంకోర్ట్ చారిత్ర్యక తీర్పు..!సమీక్ష నిర్వహిస్తామంటున్న ముస్లిం లా బోర్డ్..! అయోధ్య రాముడిదే..! సుప్రీంకోర్ట్ చారిత్ర్యక తీర్పు..!సమీక్ష నిర్వహిస్తామంటున్న ముస్లిం లా బోర్డ్..!

ఈనేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌ తీర్పుపై సానుకూలత వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును అందరు స్వాగతించాలని సీఎం నితీష్ కుమార్ అన్నారు. సామాజికపరంగా అందరు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Supreme Courts judgment welcomed all political parties

మరోవైపు కేంద్రంలోని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌‌సింగ్‌తో‌పాటు, నితిన్ గడ్కరీ, హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సుప్రీం తీర్పు చారిత్రత్మకమని పేర్కోన్నారు. ఇక రాజకీయపరంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ప్రశాంత వాతవరణం కొనసాగుతోంది. కాగా తీర్పుకు ముందే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ఘర్షణలు లేకుండా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశంలోని పలు అధ్యాత్మిక సంస్థలు, మందిర కమిటీలు సైతం తీర్పును స్వాగతిస్తున్నాయి.

English summary
Supreme Court's judgment should be welcomed everyone, it will be beneficial for the social harmony says various state chief minister and political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X