వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లలో ఫేస్ బుక్ పాత్ర - ఎండీ అజిత్‌పై తక్షణ చర్యలు వద్దన్న సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలను తొలగించకుండా తాత్సారం చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్ బుక్ సంస్థకు స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ అల్లర్ల కేసులకు సంబంధించి ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్య‌క్షుడు, ఎండీ అజిత్ మోహ‌న్‌ పై అక్టోబర్ 16 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి లో చోటుచేసుకున్న అల్ల‌ర్లకు సంబంధించిన కేసులను ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ విచారణ చేస్తున్నది. అందులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ ప్యానెల్.. ఫేస్ బుక్ ఇండియా హెడ్ అజిత్ మోహన్ ను ఆదేశించగా.. సదరు నోటీసులపై నోటీసుల‌పై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన కోర్టు.. అక్టోబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు అజిత్ పై చర్యలు వద్దని ఢిల్లీ అసెంబ్లీ ప్యాన‌ల్‌కు ఆదేశాలిచ్చింది.

తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులుతిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు

Supreme Court say no action against Facebook India head till 15 Oct

ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల స‌మ‌యంలో.. ఫేస్ బుక్ పథకం ప్రకారమే విద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌ను ప్ర‌చారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా, ఫేస్ బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దన్న కోర్టు.. ఢిల్లీ అసెంబ్లీ ప్యాన‌ల్‌ తోపాటు న్యాయ‌శాఖ‌, హోంశాఖ‌, ఐటీశాఖ‌, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీలు, ఢిల్లీ పోలీసులు కూడా ఈ అంశంపై స్పందించాలని పేర్కొనడం గమనార్హం.

జగన్ జీ.. మీ వల్ల చాలా సంతోషం - వార్డు సచివాలయాలు భేష్ - ఏపీ సీఎంకు ప్రధాని మోదీ కితాబుజగన్ జీ.. మీ వల్ల చాలా సంతోషం - వార్డు సచివాలయాలు భేష్ - ఏపీ సీఎంకు ప్రధాని మోదీ కితాబు

బీజేపీతో లింకులు, యూజర్ల భద్రత అంశాలకు సంబంధించి ఫేస్ బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్ ఈ నెల ప్రారంభంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చైర్మన్ గా ఉన్న ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ ఎదుట కూడా హాజరయ్యారు. ''పౌరుల హక్కుల పరిరక్షణ, సోషల్, ఆన్ లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫాఫ్ దుర్వినియోగాన్ని నిరోధించడం'' అనే అంశంపై థరూర్ కమిటీ ఫేస్ బుక్ ను ప్రశ్నలు అడిగింది.

English summary
Supreme Court issued notice on Facebook India's VP and MD, Ajit Mohan and directed that no coercive action will be taken against him till 15 October, when it will take up the matter for further hearing in the case in connection with a summon asking him to depose before it with regard to north east Delhi riots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X