వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్, వాట్సాప్ లపై సుప్రీంకోర్టు ఆగ్రహం, నోటీసులు జారీ

ఫేస్ బుక్ , వాట్సాప్ తో పాటు ట్రాయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, వాట్సాప్ లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఫేస్ బుక్, వాట్సాప్ లపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. వాట్సాప్ లలో పంపే సందేశాలను ఫేస్ బుక్ యాక్సెస్ చేస్తోందని ఎన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నా ఫేస్ బుక్ వాటిని ఉల్లంఘిస్తోందని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రెండు కంపెనీల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాట్సాప్ మేసేజ్ ఎన్ క్రిప్ట్ అయినా బయటకు ఎలా పొక్కుతోందని సుప్రీం ప్రశ్నించింది. వినియోగదారుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లినట్టు కాదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వీటి తీరుపై సుప్రీం సీరియస్ అయింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సోషల్ మీడియాపై మీ పాలసీ ఏమిటో చెప్పాలని కూడ ఆదేశించింది. దేశంలో సోషల్ మీడియాకు ఎలాంటి విధానం ఉండాలనుకొంటున్నారో తెలపాలని ట్రాయ్ ను ఆదేశించింది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్రాయ్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

supreme court

ఈ విషయమై సమగ్రంగా పరిశోధన చేసి నివేదిక ఇవ్వాలని అటార్ని జనరల్ ముకల్ రోహతికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు చెప్పింది. మార్కెటింగ్, కమర్షియల్ , అడ్వర్ టైజింగ్ కోసం తన పేరేంట్ కంపెనీ ఫేస్ బుక్ తో యూజర్ల డేటాను షేర్ చేసుకొనేందుకుగా వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఓ కొత్త పాలసీని తెచ్చింది.

ఈ పాలసీని తెచ్చినప్పటి నుండి వాట్సాప్ నుండి చిక్కులు ఎదురౌతున్నాయి. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ పాలసీపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రేవసీకి భంగమనే విమర్శలు వచ్చాయి.

వాట్సాప్ ను, ఫేస్ బుక్ తప్పుదోవ పట్టిస్తోందంటూ గత నెల యూరోపియన్ కమషన్ కూడ అభిప్రాయపడింది. యూరప్ లో ఈ విషయమై తీవ్ర ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ రెండు కంపెనీలు డేటా షేరింగ్ ను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టుగా ఫేస్ బుక్ ప్రకటించింది.

English summary
the supreme court on monday issued notices to centre, facebook, shatsapp and trai on a plea that sought government regulation of the online messaging services. the issue raised in the petition concern the new privacy policy of whatsapp under which the app can share data with the parent organisation facebook. this, petition alleges, may amount to invasion of privacy of individuals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X