వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతకు సుప్రీం షాక్: ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీ ఫలితాలు వెల్లడించొద్దు: సుప్రీం

By Narsimha
|
Google Oneindia TeluguNews

కొల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు నుండి ఊహించని షాక్ ఎదురైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ ఫలితాలను జులై మూడు వరకూ ప్రకటించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది.

రాష్ట్రంలోని 34 శాతం పంచాయితీ సీట్లు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలోపంచాయితీ సీట్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. గతంలో సీపీఎం నేతృత్వంలో లెఫ్ట్‌ఫ్రంట్ అధికారంలో ఉన్న కాలంలో కేవలం 11 శాతం మాత్రమే పంచాయితీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవంపై సుప్రీం కోర్ట్‌ స్టే ఇచ్చింది. మే 14న, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ ఫలితాలను జులై మూడు వరకూ ప్రకటించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది.

Supreme Court stays Calcutta High Court order on West Bengal panchayat polls

రాష్ట్రంలో సుమారు 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాష్ట్ర చరిత్రలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకుంది.

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి.

దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్‌ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే ఎన్నికల కమీషన్‌ వాటిని తిరస్కరించింది.

English summary
The Supreme Court today stayed the Calcutta High Court order asking the West Bengal State Election Commission to accept nomination papers filed through e-mail for contesting the panchayat elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X