వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథువా రేప్ కేసుపై సుప్రీం స్టే, బదిలీ పిటిషన్‌పై విచారణ మే ఏడుకు వాయిదా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది కేసు విచారణను చంఢీఘడ్‌కు బదిలీ చేయించాలనే అప్పీల్‌పై స్పందించాలని నిందితుడిని కోరింది.

కథువాలో శనివారం జరగాల్సిన విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా , జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది.

Supreme Court stays trial in Kathua rape, murder case till May 7

కేసు బదలాయింపు పిటిషన్‌పై మే 7న తాము విచారణ చేపడతామని ప్రకటించింది. గతంలో కేసు విచారణను చంఢీఘఢ్‌కు తరలించాలనే ప్రతిపాదనను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. జమ్మూ కాశ్మీర్‌లో విభిన్న పీనల్‌కోడ్ ఉన్నందున విచారణను బదలాయిస్తే సాక్షులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని చెప్పారు.

అయితే కేసు విచారణలో ఎలాంటి సహయం చేసేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.కథువాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

English summary
The Supreme Court on Friday stayed till May 7 the trial in the case of the rape and murder of a minor in Kathua in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X