వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు సంఘాలకు సుప్రీం వార్నింగ్- రహదారుల దిగ్బంధనానికి అనుమతించబోం...

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాది కాలంగా రైతులు రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది.

రైతుల నిరసనల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా రైతులు రోజుల తరబడి నిరసనల పేరుతో రోడ్లను దిగ్బంధించడం కుదరదని సుప్రీంకోర్టు రైతు సంఘాలకు తేల్చిచెప్పింది. రైతుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ ... కేంద్రం ఉద్దేశపూర్వకంగా రోడ్లను నిర్బంధించి ప్రజల్ని రైతులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రోడ్లపై నిరసనలు అభ్యంతరం అనుకుంటే రైతుల్ని రాజధాని నడిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదానంతో పాటు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతించాలని కోరారు. దీంతో వాదనలు విన్న జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం "ఉద్యమంలో సమస్య ఉంది, సమస్య లేదంటే మేము అంగీకరించబోమని తెలిపారు.

supreme court strong warning to farmers over protests, key remarks over roads blockade

మరోవైపు హర్యానా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో రైతులకూ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
అలాగే షహీన్ బాగ్ నిరసనలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా తాము రోడ్లను దిగ్బంధించడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

English summary
The Supreme Court on today said public roads cannot be blocked even as the farmers' side and government engaged in a verbal blame-game during a physical hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X