వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణ

|
Google Oneindia TeluguNews

మహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్‌ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్‌ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులు దాఖలు చేశారు. దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిల్‌లో పేర్కొన్నారు.

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌లో కూడా మహిళలను మసీదుల్లోకి అనుమతించకూడదని ఎక్కడా పేర్కొనబడలేదని తెలిపారు. ఇది మహిళల మనోభావాలను కించపరచడమే కాదు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కూడా అవుతుందని వారి తరుపున లాయర్ అశుతోష్ దూబే అన్నారు. మహిళలకు పురుషులకు సమాన హక్కులు కలిగి ఉన్నారని అశుతోష్ దూబే అన్నారు.

Supreme court to hear plea on women entry into mosque

ప్రస్తుతం జమాత్-ఈ-ఇస్లామి మరియు ముజాహిద్ సెక్ట్‌కు చెందిన మహిళలకు మాత్రమే మసీదులో నమాజ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే సున్నీ వర్గం వీరు నమాజ్ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఒకవేళ మహిళలను మసీదుల్లోకి అనుమతించిన పురుషులకు మహిళలకు వేర్వేరు ప్రవేశద్వారాలు పెడుతున్నారని పిల్‌లో పేర్కొంది. అంతేకాదు వారి వాదనను బలం చేకూర్చేందుకు ఈ మధ్య సుప్రీంకోర్టు శబరిమలై తీర్పును ప్రస్తావించారు.

English summary
The Supreme Court will hear on Tuesday a public interest litigation (PIL) seeking permission for Muslim women to enter and offer namaz inside mosques.The plea was filed by a Muslim couple who asked the apex court to declare the prohibition on entry of women inside mosques in the country as illegal and unconstitutional as it violated the fundamental rights guaranteed under the Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X