వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగు చట్టాలపై సుప్రీంతీర్పు రేపే -ఇప్పటికే కేంద్రంపై కోర్టు ఆగ్రహం -చర్చలు ఫలిస్తాయన్న తోమర్

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఆ చట్టాలపై మంగళవారమే తీర్పు వెలువరించనుంది. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేదాకా చట్టాలపై స్టే ఇవ్వాలనుకుంటున్నట్లు సోమవారం నాటి విచారణలో స్పష్టం చేసిన కోర్టు.. తీర్పు ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెప్పింది.

వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్

''సాగు చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేయకపోతే.. మేం స్టే విధిస్తాం. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తాం'' అని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మళ్లీ విచారణ ఎప్పుడు ఉంటుందనేదానిపై ఒకింత తర్జనభర్జనల తర్వాత.. మంగళవారమే తీర్పు ఉంటుందని సుప్రీంకోర్టు వర్గాలు ప్రకటించాయి.

 Supreme Court to pronounce orders on Tuesday on farm laws, tomar hopes on talks

దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు దాదాపు 50 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా.. చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాలను వెనక్కి తీసుకోబోమని మోదీ సర్కార్ పట్టుపట్టిన వేళ.. సీజేఐ బెంచ్ వ్యాఖ్యలతో షాక్ తగిలినట్లయింది. మరోవైపు..

కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?

వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈసారి చర్చల్లో సమస్యకు ఒక పరిష్కారం తప్పక వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన అన్నారు.

English summary
The Supreme Court will pronounce orders on Tuesday on various issues related to the new farm laws and the farmers' ongoing protest at Delhi borders and may take a call on setting up of a committee headed by a former Chief Justice of India to find ways to resolve the impasse. Union Agriculture Minister Narendra Singh Tomar expressed hope that there will be progress in talks with the farmers' unions amid the protests against the agrarian laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X