• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనంత పద్మనాభుడి ఆలయంపై సుప్రీం సంచలనం: ఆరో గదిపై సస్పెన్స్‌కు తెర? మిస్టరీ..మిస్టరీగానే

|

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలసిన అనంత పద్మనాభస్వామి ఆలయం పేరు వింటే.. ఛప్పున గుర్తుకొచ్చేవి.. నేలమాళిగలు.. ఆలయం నేలమాళిగల్లో ఉన్న ఆరు గదులు.. అందులో ఉన్న అంతులేని ధనరాశులు. ఆలయానికి చెందిన అయిదు గదులను తెరిచినప్పటికీ.. ఆరో గది తలుపులను తెరవడానికి సాహసించట్లేదు. ఆ గది తలుపులను తెరిచే ధైర్యం చాలట్లేదు ఎవరికీ. ఈ గది తలుపులు తెరవాలా? వద్దా? అనే విషయంపై తొమ్మిదేళ్ల తరువాత కూడా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు.

  Shree Padmanabhaswamy ఆలయ ఆరో గదిపై సస్పెన్స్‌కు తెర! || Oneindia Telugu

  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతను బలి తీసుకున్న కరోనా: అనుచరుల్లో ఆందోళన: హోమ్ క్వారంటైన్

  ఆ హక్కులు వారివే..

  ఆ హక్కులు వారివే..

  ఈ సస్పెన్స్‌కు తెర దించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ దిశగా సంచలన తీర్పును వెలువరించింది. అనంత పద్మనాభస్వామి ఆలయం, పరిపాలనపై సర్వ హక్కులకూ ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అప్పగించింది. ఆలయ పరిపాలన, నిర్వహణపై పూర్తి హక్కుదారులు ట్రావెన్‌కోర్ రాజ వంశీయులేనని తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అంతులేని ధనరాశులు, గుప్త నిధులు ఉన్నట్లుగా భావిస్తోన్న నేలమాళిగలోని ఆరో గది తలుపులను తెరవాలా? వద్దా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకునే హక్కు ట్రావెన్‌కోర్ రాజ వంశీయులకు ఉందని స్పష్టం చేసింది.

  ఆలయ హక్కులపై కేరళ హైకోర్టు

  ఆలయ హక్కులపై కేరళ హైకోర్టు

  నేల మాళిగల్లోని ఆరు గదుల్లో అయిదింటిని 2011లో తెరిచిన విషయం తెలిసిందే. ఈ అయిదింట్లో కూడా ఒక గదిని మించి మరో గదిలో అంతులేని నిధులు వెలుగులోకి వచ్చాయి. వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు, నగలు, వజ్రాలు.. ఇలా విలువ కట్టడానికి కూడా సాధ్యపడలేనన్ని నిధులు ఆ అయిదు గదుల్లో కనిపించాయి. శతాబ్దాల కిందటి నుంచీ వారసత్వ సంపదగా వస్తోన్న ఆ ధనరాశులు నిల్వ ఉంటూ వచ్చాయి. ఆరో గదిని కూడా తెరవడానికి అప్పట్లో కేరళ దేవస్వొం బోర్డు మంత్రిత్వ శాఖ ప్రయత్నించగా.. ట్రావెన్‌కోర్ రాజవంశీయులు అడ్డుపడ్డారు.

   నాగబంధనం ఉండటం వల్ల

  నాగబంధనం ఉండటం వల్ల

  ఆరోగది తలుపులపై నాగబంధనం ముద్ర ఉందని, దాన్ని తెరిస్తే వినాశనం తప్పదంటూ అప్పట్లో ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ప్రభుత్వం ఆ ఆరోగది తలుపులను తెరవడానికి ప్రయత్నించగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేరళ హైకోర్టులో పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆలయంపై ట్రావెన్‌‌కూర్ రాజవంశీయులకు మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది.

  సుప్రీంకోర్టులో సవాల్..

  సుప్రీంకోర్టులో సవాల్..

  కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణ ముగించినప్పటికీ.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. సోమవారం ఈ తీర్పును వెలువరించింది. న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రలతో కూడిన ధర్మాసనం తీర్పు వినిపించింది. ఇదివరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అనంత పద్మనాభస్వామి ఆలయంపై, పరిపాలనపై, అక్కడున్న అపార ధనసంపదపైనా సర్వ హక్కులు కూడా ట్రావెన్‌కూర్ రాజకుటుంబానికి ఉందని స్పష్టం చేసింది.

  సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో..

  సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో..

  సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులతో ఇక అనంత పద్మనాభుడి ఆలయం నేలమాళిగల్లోని ఆరోగది తలుపులు ఇక తెరచుకోకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నయి. ఆరో గది తలుపులను తెరవాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఇక పూర్తిగా ట్రావెన్‌కోర్ రాజ వంశీయులపైనే ఆధారపడి ఉంది. వారు దీనికి వ్యతిరేకమని అంటున్నారు. ఫలితంగా- ఆరో గదికి సంబంధించిన మిస్టరీ.. మిస్టరీగానే ఉండిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా.. సుప్రీంకోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం స్వాగతించింది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేరళ దేవస్వొం శాఖ మంత్రి కడగంపల్లి సురేంద్రన్ వ్యాఖ్యానించారు.

  English summary
  The Supreme Court on Monday upheld the rights of the Travancore royal family in the administration of Shree Padmanabhaswamy Temple in Kerala. A Bench of Justice UU Lalit and Justice Indu Malhotra approved the continuation of a committee
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more