బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుప్రీం కోర్టు తీర్పు, బీజేపీ, సీఎంకు టెన్షన్ టెన్షన్, అధికారం ? దేవుడా కర్ణాటక, మహారాష్ట్రలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేల కేసు విచారణ చేసిన సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. అనర్హత ఎమ్మెల్యేల కేసు తీర్పు వెలువడుతున్న సమయంలో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పకు, బీజేపీ నాయకులకు టెన్షన్ మొదలైయ్యింది. బుధవారం వేకువ జామున నుంచి సీఎం బీఎస్. యడియూరప్ప యడతెరిపిలేకుండా బీజేపీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టులో తీర్పు ఏలా వస్తుందో ? అంటూ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనర్హత ఎమ్మెల్యేల కేసు తీర్పు వెలువడుతున్న సందర్బంగా సీఎం యడియూరప్ప బుధవారం మద్యాహ్నం 3 గంటల వరకూ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.

తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!

 అధికారం ఇచ్చిన దేవుళ్లు !

అధికారం ఇచ్చిన దేవుళ్లు !

కర్ణాటకలో బీఎస్. యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అనర్హత ఎమ్మెల్యేలు కారణం. అయితే ఇప్పుడు అనర్హత ఎమ్మెల్యేల కేసు తీర్పు నేడు వెలువడుతున్న సమయంలో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి ఏమైనా సమస్యలు ఎదురౌతాయా ? అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఉంటుందా ? అనే విషయం సుప్రీం కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.

బీజేపీ నేతల్లో ఆందోళన !

బీజేపీ నేతల్లో ఆందోళన !

బుధవారం సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యే కేసు తీర్పు ప్రకటించిన తరువాత బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగనుంది. ఇప్పటికే అనర్హత ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. సుప్రీం కోర్టు తీర్పు కోసం అనర్హత ఎమ్మెల్యేలు, సీఎం యడియూరప్ప, బీజేపీ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఉప ఎన్నికలకు సిద్దం

ఉప ఎన్నికలకు సిద్దం

డిసెంబర్ 5వ తేదీన కర్ణాటకలోని 15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్దం చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించిన తరువాత బీజేపీ నాయకులు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం ఉదయం 10.30 గంటల తరువాత కర్ణాటక రాజకీయాల ముఖ చిత్రం మారిపోనుంది.

 విజయనగరం ఎఫెక్ట్

విజయనగరం ఎఫెక్ట్

జులై 1వ తేదీన విజయనగరం నియోజక వర్గం శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేశారు. తరువాత కర్ణాటక శాసన సభలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడంతో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అప్పటి కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి ఆయన పదవికి రాజీనామా చేశారు.

మహారాష్ట్ర, కర్ణాటకలో టెన్షన్ టెన్షన్!

మహారాష్ట్ర, కర్ణాటకలో టెన్షన్ టెన్షన్!

బీజేపీ నాయకులకు ఇప్పుడు మరో టెన్షన్ మొదలైయ్యింది. ఇదే నెలలో బీజేపీకి మహారాష్ట్రలో అధికారం అందినట్లే అంది దూరం అయ్యింది. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ నాయకులకు మరో టెన్షన్ మొదలైయ్యింది. సుప్రీం కోర్టు తీర్పు తరువాత మనం ఏం చెయ్యాలి ? అంటూ బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు. అనర్హత ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వస్తే ఏం చెయ్యాలి, తీర్పు తరువాత ఎదురు దెబ్బ తగిలితే ఏం చెయ్యాలి ? అని బీజేపీ నాయకులు అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడానికి బీజేపీలోనే అసమ్మతి ఎదురైయ్యింది.

English summary
New Delhi: Ahead of the supreme court verdict on 17 disqualified MLA's of Karnataka chief minister B.S.Yediyurappa program not listed till 3 Pm on November 13, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X