వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala Verdict Live Updates: ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం, విస్తృత ధర్మాసనానికి రివ్యూ పిటిషన్

|
Google Oneindia TeluguNews

అయోధ్య భూ వివాద సమస్యను సానుకూలంగా పరిష్కరించిన సుప్రీంకోర్టు గురువారం (14 నవంబర్) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వనున్నది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాఫెల్, ప్రధాని నరేంద్రమోడీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసుల తుది తీర్పు కూడా గురువారం వెల్లడి కానున్నది. ఈ క్రమంలో శబరిమలై అంశంపై లైవ్ అప్‌డేట్స్ మీ కోసం...

Supreme Court Verdict on Sabarimala Review Petition Live Updates

Newest First Oldest First
10:54 AM, 14 Nov

3: 2 మెజార్టీతో విస్తృత బెంచ్‌కు ముందుకు

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో 3: 2 మెజార్టీతో విస్తృత బెంచ్‌కు ముందుకు శబరిమల అంశం.. విభేదించిన జస్టిస్ నారిమన్, చంద్రచూడ్
10:51 AM, 14 Nov

శబరిమల రివ్యూ కేసు పలు అంశాలు

శబరిమల రివ్యూ కేసు.. మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, పార్సీ మహిళల కేసు, దావూదీ బోరా కేసు అంశాలతో ముడిపడి ఉందన్న సుప్రీంకోర్టు బెంచ్
10:48 AM, 14 Nov

హిందూ మహిళలకే పరిమితం కాకూడదు

శబరిమల తీర్పు కేవలం హిందూ మహిళలకే పరిమితం కాకూడదన్న సుప్రీంకోర్టు
10:40 AM, 14 Nov

ప్రతీ ఒక్కరికి మత స్వేచ్ఛ

జస్టిస్ గొగోయ్: రివ్యూతోపాటు అనేక పిటిషన్లు మా ముందుకు వచ్చాయి. ప్రతీ ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుంది.
10:37 AM, 14 Nov

తీర్పును చదువుతున్న జస్టిస్ గొగోయ్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై తీర్పును చదువుతున్న జస్టిస్ గొగోయ్
10:36 AM, 14 Nov

సుప్రీంకోర్టుకు చేరుకొన్న జస్టిస్ రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టుకు చేరుకొన్న జస్టిస్ రంజన్ గొగోయ్.. ఇతర న్యాయమూర్తులు
10:09 AM, 14 Nov

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెలువరించనున్న చివరి అతిపెద్ద కేసుగా శబరిమలై రివ్యూ పిటిషన్ ఉండనుంది. దీని తర్వాత రాఫెల్ కేసులో తీర్పు చివరిదిగా ఉండనుంది
10:07 AM, 14 Nov

కాసేపట్లో శబరిమల రివ్యూ పిటిషన్ పై తీర్పు.. సర్వత్రా ఆసక్తి, అందరి చూపు ఈ ఐదుగురు జడ్జీల వైపే
9:34 AM, 14 Nov

శబరిమల పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసుల వలయంలోకి వెళ్లిపోయిన శబరిమల ఆలయ పరిసరాలు
9:06 AM, 14 Nov

జడ్జీలు జోక్యం చేసుకోకూడదు

జస్టిస్ ఇందు మల్హోత్రా: భక్తి విశ్వాసాల విషయంలో జడ్జీలు జోక్యం చేసుకోకూడదు. భక్తుల హక్కులను నిర్ణయించకూడదు. జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలు పరిగణనలోకి రావు.
8:42 AM, 14 Nov

లింగ వివక్ష ఉండకూడదు.

జస్టిస్ దీపక్ మిశ్రా: భక్తి విశ్వాసాల విషయంలో లింగ వివక్ష ఉండకూడదు.
8:34 AM, 14 Nov

కట్టుదిట్టమైన భద్రత

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
8:16 AM, 14 Nov

అయ్యప్ప భక్తుల్లో ఉత్కంఠ

శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లపై నేడు 10.30 గంటలకు సుప్రీం కోర్టు తుది తీర్పు.. అయ్యప్ప భక్తుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
11:30 PM, 13 Nov

మొత్తం 65 పిటిషన్లపై తుది తీర్పు

మొత్తం 65 పిటిషన్లపై తుది తీర్పు
శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 56 రివ్యూ పిటిషన్లు, 4 తాజా రిట్ పిటిషన్లు, 5 ట్రాన్స్‌‌ఫర్ అభ్యర్థన పిటిషన్లతో కలిపి మొత్తం 65 పిటిషన్లపై అత్యున్నత కోర్టు తీర్పు వెల్లడించింది.
8:41 PM, 13 Nov

ఆలయంలో 10000 మంది పోలీసులు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలో 10000 మంది పోలీసుల మోహరింపు. దేవాలయంలో కట్టుదిట్టమైన చర్యలు.
7:07 PM, 13 Nov

నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్

నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్ (NADA) రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. రుతుస్రావంతో ప్రవేశించడం ద్వారా ఆలయం మలినం అవుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పు ఉంటుందనే భావనను వ్యక్తం చేసింది.
5:56 PM, 13 Nov

బోర్డు ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ స్పందన

బోర్డు ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ స్పందన
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ట్రావంకోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి బోర్డు కట్టుబడి ఉంది. భక్తుల ప్రయోజనాలను కూడా పరిరక్షిస్తాం అని తెలిపారు.
5:30 PM, 13 Nov

దేశవ్యాప్తంగా ఆందోళనలు

సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా శబరిమల దగ్గర భక్తులు మహిళలను అడ్డుకున్నారు. అంతేకాదు మహిళలకు రుతుక్రమం ఉన్న సమయంలో వారిని మైలగా చూస్తారనే నమ్మకం అక్కడి భక్తుల్లో ఉంది. అలాంటి మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే శాపం తగులుతుందని భక్తులు విశ్వసిస్తారు.
5:23 PM, 13 Nov

4-1 మెజార్టీతో 2018 సుప్రీంకోర్టు తీర్పు

2018 సుప్రీంకోర్టు తీర్పు 4-1 మెజార్టీతో వచ్చింది. నలుగురు జడ్జీలు మహిళల ప్రవేశంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులోని మహిళా జడ్జి ఇందూ మల్హోత్రా మాత్రం ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉండకూదని తీర్పు రాసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 65 రివ్యూ పిటిషన్లు ధాఖలయ్యాయి.
5:21 PM, 13 Nov

ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం

అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసుపై తీర్పు ఇచ్చింది.
5:21 PM, 13 Nov

గతేడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గతేడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇస్తూ కేరళలో పత్తినంథిట్ట జిల్లాలోని దట్టమైన అడవుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి సన్నిధానంలో 50 సంవత్సరాల లోపు మహిళలకు ప్రవేశాన్ని కల్పించింది.
5:20 PM, 13 Nov

ఎనిమిదేళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు

ఎనిమిదేళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు అయ్యప్ప స్వామిని ఎందుకు దర్శించకూడదని, ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ పిటీషన్ దాఖలు చేశారు.

English summary
The Supreme Court of India will pronounce final verdict on review petitions filed in Sabarimala cases on November 14th. This verdict will be delivered by a constitution bench comprising Chief Justic of India Ranjan Gogoi and Justices Rohinton fali Nariman, Am Khanwilkar, D Y Chandrachud and Indu Malhotra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X