వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Sabarimala Verdict Live Updates: ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం, విస్తృత ధర్మాసనానికి రివ్యూ పిటిషన్
అయోధ్య భూ వివాద సమస్యను సానుకూలంగా పరిష్కరించిన సుప్రీంకోర్టు గురువారం (14 నవంబర్) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వనున్నది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పలు కేసుల్లో తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాఫెల్, ప్రధాని నరేంద్రమోడీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసుల తుది తీర్పు కూడా గురువారం వెల్లడి కానున్నది. ఈ క్రమంలో శబరిమలై అంశంపై లైవ్ అప్డేట్స్ మీ కోసం...
Newest First Oldest First
బోర్డు ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ స్పందన

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ట్రావంకోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి బోర్డు కట్టుబడి ఉంది. భక్తుల ప్రయోజనాలను కూడా పరిరక్షిస్తాం అని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆందోళనలు
సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా శబరిమల దగ్గర భక్తులు మహిళలను అడ్డుకున్నారు. అంతేకాదు మహిళలకు రుతుక్రమం ఉన్న సమయంలో వారిని మైలగా చూస్తారనే నమ్మకం అక్కడి భక్తుల్లో ఉంది. అలాంటి మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే శాపం తగులుతుందని భక్తులు విశ్వసిస్తారు.
4-1 మెజార్టీతో 2018 సుప్రీంకోర్టు తీర్పు
2018 సుప్రీంకోర్టు తీర్పు 4-1 మెజార్టీతో వచ్చింది. నలుగురు జడ్జీలు మహిళల ప్రవేశంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులోని మహిళా జడ్జి ఇందూ మల్హోత్రా మాత్రం ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉండకూదని తీర్పు రాసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 65 రివ్యూ పిటిషన్లు ధాఖలయ్యాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!