• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్ టాక్ యాప్ నిషేధం పై సుప్రీం నిర్ణయం ... యాపిల్ , గూగుల్ సంస్థలకు తొలగించాలని ఆదేశం

|

టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలుసు . అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు సదరు యాప్ కంపెనీ నిర్వాహకులు .

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటేస్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటే

 టిక్‌టాక్ యాప్ బ్యాన్ పై కొనసాగుతున్న విచారణ .. తీర్పు ఏప్రిల్ 22న

టిక్‌టాక్ యాప్ బ్యాన్ పై కొనసాగుతున్న విచారణ .. తీర్పు ఏప్రిల్ 22న

ఏప్రిల్ 9న ఈ కేసు విషయంలో నిషేదంపై విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 16న జరిగింది . నేడు వాదనలు విన్న కోర్టు నిషేధాన్ని కొనసాగించాలని చెప్పింది.మరోమారు కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తీర్పును ఏప్రిల్ 22 నాటికి వాయిదా వేసింది.

 తమిళనాడులో యాప్ బ్యాన్ ను సవాల్ చేస్తూ సుప్రీంలో కేసు

తమిళనాడులో యాప్ బ్యాన్ ను సవాల్ చేస్తూ సుప్రీంలో కేసు

ఈ యాప్ ను నిషేధించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూదాఖలైన పిటిషన్ పై వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వారం రోజలకు వాయిదా వేసింది. పిటిషనర్ తరుపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. భావ ప్రకటన స్వేచ్చను ఉల్లంఘిస్తున్నాయంటూ సింఘ్వీ పిటిషనర్ తరపున వాదించారు.

వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం .. నిషేధం వైపే మొగ్గు

వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం .. నిషేధం వైపే మొగ్గు

టిక్‌టాక్ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందంటూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. ఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోల ప్రసారంపై మీడియాకు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రసారం చేయరాదని తీర్పులో పేర్కొంది.

గూగుల్, ఆపిల్ సంస్థలకు ప్లే స్టోర్ నుండి టిక్‌టాక్ యాప్ తొలగించాలని ఆదేశం

గూగుల్, ఆపిల్ సంస్థలకు ప్లే స్టోర్ నుండి టిక్‌టాక్ యాప్ తొలగించాలని ఆదేశం

మరోమారు కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తీర్పును ఏప్రిల్ 22 నాటికి వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు విధించిన నిషేదం అప్పటి వరకూ కొనసాగుతుందని చెప్తూనే గూగుల్, ఆపిల్ సంస్థలను టిక్ టాక్ యాప్ తొలగించాలని ఆదేశించింది. యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్‍‌ను తొలిగించాలని పేర్కొంది. కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్‌లలో గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఖాతాదార్లుగా 88.6 మిలియన్ యూజర్లు ఉన్నారట. . ఇప్పటికే యూఎస్, యూకే, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్‌లపై పూర్తిగా నిషేధం ఉంది .

English summary
The Centre has reportedly asked Google and Apple to remove popular Chinese short-video mobile application TikTok from their app stores. The move by the Ministry of Electronics and Information Technology (Meity) came after the Supreme Court on Monday refused to stay the Madras High Court order to ban the app.The top court said that ban directive was just an interim order and the high court is scheduled to hear the matter on April 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X