వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ ,ఫేస్‌బుక్ లకు షాకిస్తూ సుప్రీం నోటీసులు .. మీ డబ్బు కంటే ప్రజల గోప్యతే ముఖ్యమని వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సప్ సంస్థ ప్రైవసీ పాలసీ వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సప్ గోప్యతా విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం వాట్సాప్ కు, దాని మాతృసంస్థ ఫేస్ బుక్ కు నోటీస్ జారీ చేసింది. నాలుగు వారాల లోపు సమాధానం ఇవ్వాలని టెక్ దిగ్గజాలను సుప్రీం ధర్మాసనం కోరింది.

మీ డబ్బు కంటే ప్రజల గోప్యత చాలా ముఖ్యమైనదన్న సుప్రీం ధర్మాసనం

మీ డబ్బు కంటే ప్రజల గోప్యత చాలా ముఖ్యమైనదన్న సుప్రీం ధర్మాసనం

ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే, మీ డబ్బు కంటే ప్రజల గోప్యత చాలా ముఖ్యమైనదని సంస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మీరు నిర్వహించేది 2-3 ట్రిలియన్ల కంపెనీ కావచ్చు, కానీ ప్రజల గోప్యత వారికి మరింత విలువైనది మరియు వారి గోప్యతను కాపాడటం మా కర్తవ్యం అంటూ చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఫేస్‌బుక్ మరియు వాట్సాప్‌కు తెలిపింది.

 ప్రైవసీ పాలసీపై భారత పౌరులకు తీవ్ర భయాలు ఉన్నాయన్న ఎస్ఏ బొబ్డే

ప్రైవసీ పాలసీపై భారత పౌరులకు తీవ్ర భయాలు ఉన్నాయన్న ఎస్ఏ బొబ్డే


కొత్త గోప్యతా విధానం వల్ల ఎదురయ్యే గోప్యతా సమస్యలపై భారత పౌరులకు తీవ్ర భయాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సిజెఐ), ఎస్‌ఏ బొబ్డే, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

వాట్సాప్ తన కొత్త గోప్యతా విధానాన్ని భారతదేశంలో అమలు చేయకుండా నిరోధించాలని మరియు యూరోపియన్ యూనియన్ ప్రాంతంలోని వినియోగదారులకు వర్తించే గోప్యతా విధానాన్ని వర్తింపజేయాలని పిటిషన్ కోరింది. అయితే ప్రైవసీ పాలసీ పై వాట్సాప్ సంస్థతో సుప్రీం ధర్మాసనంపై విధంగా స్పందించింది.

వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టులో విచారణ

వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టులో విచారణ


జనవరిలో, వాట్సాప్ కొత్త గోప్యతా విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం ఐరోపాకు ఒకరకమైన గోప్యతా ప్రమాణాలు వర్తిస్తాయి , భారతీయులకు భిన్నమైన ప్రమాణాలు వర్తిస్తాయి. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ అని, దీంతో డేటా భద్రతపై అనుమానాలున్నాయని సీనియర్ న్యాయవాది శ్యామ్ పేర్కొన్నారు. ఇక వాట్సాప్ సంస్థ, పిటిషనర్ తరఫున హాజరైన దివాన్ ,డేటా షేరింగ్ పై ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించారు .

డేటా షేరింగ్ ఆరోపణలను ఖండించిన వాట్సాప్ .. యూరోపియన్ దేశాల్లో ప్రత్యేక డేటా రక్షణ చట్టాలున్నాయని వివరణ

యూరోపియన్లు మరియు భారతీయుల మధ్య భారీ భేదం ఉందని , ప్రత్యేక డేటా రక్షణ చట్టాలను కలిగి ఉన్న యూరోపియన్ దేశాలు మినహా అన్ని దేశాలకు ఒకే గోప్యతా విధానం వర్తిస్తుందని వాట్సాప్ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది
. అయినప్పటికీ నాలుగు వారాల్లో తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వాట్సాప్ కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది . ప్రజల గోప్యత విషయంలో కాంప్రమైజ్ కాలేమని స్పష్టం చేసింది .

 ప్రైవసీ పాలసీ విషయంలో కోర్టులో విచారణ .. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

ప్రైవసీ పాలసీ విషయంలో కోర్టులో విచారణ .. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఫేస్ బుక్ తో డాటాను పంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రైవసీ పాలసీ మార్పు చేసిన కారణంగా వినియోగదారులు తమ వ్యక్తిగత డేటా విషయంలో ఆందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 8 వ తేదీ లోపు కొత్త ప్రైవసీ పాలసీని అందరూ అంగీకరించాల్సి ఉండగా, వాట్సాప్ యూజర్లు ఒక్కొక్కరుగా నూతన ప్రైవసీ పాలసీ పై విముఖత చూపించగా పెద్ద దుమారం రేగింది. ఈ నేపథ్యంలో వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీ కి సంబంధించిన అప్డేట్ ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టులో ఈ వ్యవహారంపై పోరాటం చేస్తుంది .

English summary
The privacy of people is more important than your money," remarked the Chief Justice of India SA Bobde while issuing notices to Facebook and WhatsApp. The Supreme Court on Monday issued a notice to WhatsApp, and its parent company Facebook, in connection with a plea challenging its new privacy policy. The apex court has sought a response from the tech giants in four weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X