వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో మోడీ సర్కార్‌కు చుక్కెదురు..అలోక్ వర్మను తిరిగి సీబీఐ డైరెక్టరుగా నియమించాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

గత కొన్ని నెలలుగా జరుగుతున్న సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అశోక్ వర్మను సెలవుపై పండాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వెంటనే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు కట్టబెట్టాలంటూ చెబుతూనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలోక్ వర్మను సెలవుపై ఎలా పంతుతారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు సెలవుపై పంపుతూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అలోక్ వర్మను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం ఆయనకు పెద్ద విజయమని వర్మ తరపున వాదించిన న్యాయవాది చెప్పారు. ఇది వర్మకు ఒక్కరికే దక్కిన విజయం కాదని రాజ్యాంగానికి లోబడి పనిచేసే ప్రతి స్వతంత్ర సంస్థకు దక్కిన విజయం అని ఆయన అన్నారు. స్వతంత్ర సంస్థలపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా మోడీ సర్కార్‌కు ఎదురుదెబ్బే అని న్యాయవాది అని చెప్పారు.

Suprerme court gives shock to Centre...Orders to reinstate Alokverma as CBI director

సీబీఐ డైరెక్టరు పై చర్యలు తీసుకునేముందు అపాయింట్‌మెంట్ కమిటీని సంప్రదించి ఉంటే బాగుండేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అలోక్‌వర్మకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలోక్ వర్మపై ఇంకా అవినీతి ఆరోపణలు ఉన్నాయని... ఆరోపణలు ఉన్నంత మాత్రానా ఆయన్ను సీబీఐ డైరెక్టరుగా తప్పించి సెలవుపై పంపడం సరికాదని సుప్రీం వ్యాఖ్యానించింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయ్యేవరకు ఆయనే సీబీఐ డైరెక్టరుగా కొనసాగుతారని సుప్రీం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆయన ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది.

English summary
In a shocker to centre, Supreme court pronounced the judgement. The apex court said that it was not correct sending Varma on leave and that the court had struck down the orders that were issued by centre regarding Alokverma's leave. The court also ordered the centre to reappoint Alok verma as CBI director.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X