వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా ఎఫెక్ట్ః రిసెప్ష‌న్ ర‌ద్దు చేసుకుని అమ‌రుల కుటుంబాల‌కు ఆ జంట ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

సూర‌త్ : గురువారం జమ్మూ క‌శ్మీర్లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 40 మందికి పైగా జ‌వాన్లు అమ‌రులైన‌ సంగ‌తి తెలిసిందే. ఘ‌ట‌న‌పై ప్ర‌పంచం అంతా భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. అదే స‌మ‌యంలో దేశంలోని చాలామంది అమ‌రుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామంటూ ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే సూర‌త్‌కు చెందిన ఓ కొత్త జంట త‌మ రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసుకున్నారు.

సూర‌త్‌లోని రెండు కుటుంబాలు త‌మ పిల్ల‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిపించాల‌ని భావించారు. పెళ్లి ఘ‌నంగా జ‌రిపించారు. ఙ‌క అంతే గ్రాండ్ గా రిసెప్ష‌న్ కూడా చేయాల‌ని భావించారు. అంత‌లోనే పుల్వామా దాడుల‌కు సంబంధించిన చేదు వార్త వినాల్సి వ‌చ్చింది. దీంతో ఒక్క‌సారిగా నిరాశ‌కు లోన‌య్యారు. ఉగ్ర‌వాదులు దాడుల‌కు జ‌వాన్లు అమ‌రుల‌య్యార‌ని తెలుసుకుని ఓ వైపు దేశ‌మంతా బాధ‌ప‌డుతుంటే తాము మాత్రం ఇలా గ్రాండ్‌గా రిసెప్ష‌న్ చేసుకోవ‌డ‌మేంటంటూ భావించి రిసెప్ష‌న్ ను ర‌ద్దు చేసుకున్నాయి ఇరుకుటుంబాలు.

Surat couple cancels wedding reception, to donate 11 lakh to families of martyred soldiers

ఇక త‌మ రిసెప్ష‌న్‌కు అయ్యే ఖ‌ర్చును రూ.5 ల‌క్ష‌లు సేవ కోసం మ‌రో రూ.11 ల‌క్ష‌లు అమ‌రులైన జ‌వాను కుటుంబాల కోసం విరాళంగా ఇచ్చారు. హ‌స్ముఖ్ భాయ్ సేథ్, అజ‌య్ సంఘ్వీ కుటుంబాలు ఈ డ‌బ్బును విరాళంగా ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారు.. పెళ్లి సందర్భంగా వంట చేసే మ‌నిషి కూడా త‌న‌వంతు స‌హాయం అందించాడు. ఇరు కుటుంబాలు వ‌జ్రాల వ్యాపారం చేస్తున్నాయి.

English summary
In a series of events, more than 35 Central Reserve Police force personnel were killed in an attack carried out by terrorists in Pulwama. A family based in Surat has decided to host their children's wedding on February 15th in a simple manner in respect to the current situation. The families have also gave a donation of Rs.11lakhs to the martyred families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X