• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో దిగ్భ్రాంతికర ఘటన: మహిళా ట్రైనీ క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు!

|

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవల రుతుస్రావంలో ఉన్న అమ్మాయిని గుర్తించేందుకు దుస్తులు విప్పించిన ఘటన మరువకముందే.. తాజాగా ఫిజికల్ టెస్ట్ కోసం వచ్చిన ట్రైనీ మహిళా క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు చేశారు. ఈ ఘటన మరోసారి తీవ్ర దుమారం రేపింది. దీంతో విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.

ట్రైనీ క్లర్క్‌లకు పరీక్షలు తప్పనిసరి..

ట్రైనీ క్లర్క్‌లకు పరీక్షలు తప్పనిసరి..

వివరాల్లోకి వెళితే.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నిబంధనల ప్రకారం ట్రైనీ సిబ్బంది తమ మూడేళ్ల శిక్షణ కాలం అనంతరం తప్పనిసరిగా ఫిజికల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేందుకు వారు శారీరకంగా ఫిట్‌గా ఉన్నారా? లేరా? అనేది తెలుసుకునేందుకు నిబంధన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న పది మంది మహిళా ట్రైనీ క్లర్క్‌లు గురువారం మున్పిసల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సూరత్ సూరత్ మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రికి వెళ్లారు.

మహిళలందర్నీ నగ్నంగా నిలబెట్టి...

మహిళలందర్నీ నగ్నంగా నిలబెట్టి...

అయితే, అక్కడ వారికి దిగ్భ్రాంతికర పరిస్థితి ఎదురైంది. పరీక్షల పేరుతో అక్కడి మహిళా వైద్యులు ఆ మహిళా క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టారు. ఈ మేరకు బాధిత మహిళలు ఆరోపించారు. ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పిలవకుండా అందర్నీ ఒకేసారి రమ్మన్నారని, వెళ్లాక తమను అందర్నీ నగ్నంగా నిలబెట్టి పరీక్షలు నిర్వహించారని వాపోయారు.

పెళ్లికాని యువతులకు గర్భధారణ పరీక్షలు

పెళ్లికాని యువతులకు గర్భధారణ పరీక్షలు

అంతేగా, ఓ మహిళా వైద్యురాలు గర్భం దాల్చడం గురించి ఇబ్బందికర ప్రశ్నలతో వేధించారని ఆరోపించారు. పెళ్లికాని అమ్మాయిలకు కూడా గర్భనిర్ధారణ పరీక్షలు చేశారని మండిపడ్డారు ట్రైనీ మహిళా క్లర్క్‌లు. ఈ దారుణ ఘటనపై మున్సిపల్ కమిషనర్ బంచనిధి పాణికి ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది.

  AP CM YS Jagan On Disha Call Center And Disha Application At Rajahmundry | Oneindia Telugu
  విచారణకు ఆదేశాలు.. రెండు ఘటనలతో దుమారం..

  విచారణకు ఆదేశాలు.. రెండు ఘటనలతో దుమారం..

  ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు కమిషనర్ పాణి. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత మహిళలకు సూరత్ మేయర్ జగదీష్ పటేల్ హామీ ఇచ్చారు. కాలేజీ విద్యార్థుల దుస్తులు విప్పించిన ఘటన, మహిళా ట్రైనీలను నగ్నంగా నిలబెట్టిన ఘటన రెండూ కూడా గుజరాత్ రాష్ట్రంలోనే జరగడంతో దుమారం రేగుతోంది.

  English summary
  Female trainee clerks of the Surat Municipal Corporation (SMC) were allegedly made to stand naked together in a room for a medical test at a civic body-run hospital, prompting authorities to order a probe.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more