వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: అందరూ మెచ్చిన ఏడు ప్రతిపాదనలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సుమారు గంటకు పైగా పార్లమెంట్‌లో ప్రసంగించిన సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో యావత్ భారతావనికి నచ్చేలా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయంట.

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తెలియజేశారు. ఇంతకీ అందరికీ నచ్చిన ఆ ప్రతిపాదనలు ఏంటంటే?

టికెట్ చార్జీలు పెంచకపోవడం:
* టికెట్ చార్జీలు పెంచకపోవడం రైల్వే ప్రయాణికులకు పెద్ద ఊరట. టికెట్ ధరలు, రవాణా చార్జీలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. అయితే దీని వెనుక మోడీ ఆలోచన ఉందని అంటున్నారు. ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పోటీ చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు. రైల్వే టికెట్ ధరలను పెంచినట్లైతే సమాన్యులపై దాని ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందనే అంచనాతోనే టికెట్ చార్జీలను పెంచలేదని తెలుస్తోంది.

సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్తులు:
* సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్త్‌ల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అంతేకాదు ప్రతి టైన్ లో వృద్ధుల కోసం 120 బెర్త్ లు కేటాయించనున్నట్లు చెప్పారు. తద్వారా ఇకపై సీనియర్ సిటిజన్లు పైన ఉండే బెర్తులకు వెళ్లే అవస్థలు పడక్కర్లేదు.

Suresh Prabhu presents rail budget: 'Fully unreserved superfast trains, increase in quota for senior citizens, women'

139 నెంబర్ ద్వారా టికెట్ రద్దు:
* 139 నెంబర్ ద్వారా రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా టికెట్ల రద్దు కోసం వెళ్లి, బుకింగ్ కోసం వచ్చే వారితో సమానంగా క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచునే అవసరం ఉండదు. సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు అందిస్తామన్నారు.

ఎస్ఎంఎస్ చేస్తే బోగీ శుభ్రం:
* ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే కోచ్, టాయిలెట్లను శుభ్రం చేసే సిబ్బంది వచ్చే విధంగా మార్పులు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ రైల్, స్వచ్ఛభారత్ కోసం స్టేషన్లు, రైళ్లను మరింతగా శుభ్రం చేయిస్తామని చెప్పారు. నాన్ ఏసీ కోచ్ ల్లోనూ చెత్తడబ్బాలను పెట్టిస్తామన్నారు.

చిన్నారుల కోసం ఆహారం, వేడి నీళ్లు:
* రైలు ప్రయాణాల్లో తల్లులు పడే బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఇందుకోసం పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ, బేబీ ఫుడ్, బేబీ బోర్డుల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కోచ్ లలో చిన్నపిల్లల కోసం పాలు, వేడినీళ్లు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.

రైలు ప్రయాణికులకు స్థానిక ఆహారం:
* సాధారణంగా రైల్లో ప్రయాణించేటప్పుడు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఆహార సమస్య. అయితే ఐఆర్‌సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం సరఫరా చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ఈ-కేటరింగ్ కాంట్రాక్టు అప్పగిస్తామని హామీయిచ్చారు.

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ ఫాం టిక్కెట్లు:
* డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ ఫాం టిక్కెట్లు కొనుగోలు సౌకర్యం.

English summary
The Union Railway Budget 2016-17 focused on capacity creation in the rail sector, with an increased outlay of about Rs. 1.21 lakh crore, and on completion of the ongoing projects rather than announcing new ones. Extending 2015's measure, passenger fares remain the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X