వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ఇండియాలో 'ఆపిల్‌' యూనిట్: సురేష్ ప్రభు

ప్రముఖ టెక్ ధిగ్గజం ఆపిల్.. తన యూనిట్‌ను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోందని కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Suresh Prabhu : Will Support Apple Investment in India

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ ధిగ్గజం ఆపిల్.. తన యూనిట్‌ను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోందని కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అయితే ఇంకా ఆపిల్ నుండి అధికారిక ప్రతిపాదన రావాల్సి ఉందన్నారు.

ప్రపంచ టెక్ ధిగ్గజం ఆపిల్ కంపెనీ ఇండియాలో తన యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ కంపెనీ ఇండియాలో తన యూనిట్‌ను ఏర్పాటు చేస్తే టెక్కీలకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ఆపిల్ యూనిట్ ఇండియాలో

ఆపిల్ యూనిట్ ఇండియాలో

ప్రపంచపు టెక్‌ దిగ్గజం ఆపిల్‌... తన యూనిట్‌ను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసుకొంది. ఈ విషయాన్ని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. అయితే ఆపిల్ కంపెనీ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని సురేష్ ప్రభు ప్రకటించారు.అధికారిక ప్రతిపాదన కోసం ఎదురుచూస్తున్నట్టు సురేష్ ప్రభు చెప్పారు.

 రాయితీలను కోరుతున్న ఆపిల్

రాయితీలను కోరుతున్న ఆపిల్

ఆపిల్ కంపెనీ ఇండియాలో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు రాయితీలను కోరుతోందని కేంద్ర పరిశ్రమల శాఖకు చెందిన వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.ఆపిల్ తయారీ యూనిట్‌లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగ వివరాలను వంటి వాటిని కేంద్రం ఆపిల్‌ నుంచి కోరుతోంది. మరో వైపు ఆపిల్‌ కోరుతున్న చాలా డిమాండ్లను కేంద్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదని మార్చి నెలలో అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

 ఆపిల్‌కు సహకరిస్తామన్న సురేష్ ప్రభు

ఆపిల్‌కు సహకరిస్తామన్న సురేష్ ప్రభు

ప్రపంచంలో టాప్‌ బ్రాండుల్లో ఆపిల్‌ ఒకటి. ఒకవేళ వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే, వాటిని పరిష్కరించడానికి కృషిచేస్తాం. మేము అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నాం'' అని సురేష్‌ ప్రభు అన్నారు. అయితే ఆపిల్ కంపెనీ కోరుతున్న రాయితీలకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తే ఆపిల్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సురేష్ ప్రభు ప్రకటనతో రెండు వైపుల నుండి కదలిక వచ్చిందని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

 ఆపిల్‌తో ఉద్యోగావకాశాలు

ఆపిల్‌తో ఉద్యోగావకాశాలు

ఆపిల్ యూనిట్‌ను ఇండియాలో ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఆపిల్ ఫోన్లు కూడ సరసమైన ధరల్లో వినియోగదారులకు లభ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

English summary
Commerce and Industry Minister Suresh Prabhu said the Centre will support iPhone maker Apple to set up manufacturing unit in the country and is awaiting a formal proposal from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X