వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని 5 విజయవంతం: నిర్మలా సీతారామన్ ధృవీకరణ, చైనాకు వణుకే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గురువారం ఉదయం 9.53గంటలకు అణ్వాయుధ సామర్థ్యంగల అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగివుంది ఈ క్షిపణి.

ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్‌ కలాం దీవుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ఇది ఐదోసారి. 2016 డిసెంబర్‌ 26న అగ్ని-5 క్షిపణీ నాలుగో దఫా పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

Surface-to-surface Agni-V missile successfully test fired off Odisha

ఈ క్షిపణినీ విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్రువీకరించారు. గురువారం అగ్ని-5 క్షిపణిని తాము విజయవంతంగా పరీక్షించి చూసినట్టు తెలిపారు.

కాగా, ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. ఈ క్షిపణి పరిధిలోనే పాక్, చైనా దేశాల్లోని కీలక ప్రాంతాలుండటం గమనార్హం.

English summary
India successfully test fired Intercontinental 5000-km range surface to surface nuclear-capable ballistic missile Agni-V from Abdul Kalam island off the Odisha coast at 9:53 am on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X