వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో 60 శాతం కరోనా పాజిటివ్: వెహికిల్స్ రానీయని స్థానికులు, డప్పు చాటింపు

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రాజధాని బెంగళూరులో వైరస్ విసృతంగా వ్యాపిస్తోంది. 60 శాతం పాజిటివ్ కేసులు ఐటీ హబ్‌లోనే ఉన్నాయి. దీంతో బెంగళూరు నుంచి వచ్చే వాహనాలను మిగతా చోట్ల ప్రజలు నిలిపివేస్తున్నారు. ఆ వాహనాలతో తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోననే భయంతో సరిహద్దుల్లోనే వెహికిల్స్ ఆపివేస్తున్నారు. తమ గ్రామం/పట్టణంలోకి రానీయడం లేదు.

 Surge in Coronavirus Cases in Bengaluru Alienates IT City..

బెంగళూరు మైసూర్ మధ్యలో గల మాండ్యలో గల ఒక పంచాయతీలో డప్పు చాటింపు వేశారు. బెంగళూరు, మైసూర్ నుంచి ఎవరూ రావొద్దని.. ఒకవేళ వస్తే రూ.5 వేల ఫైన్ వేస్తామని స్పష్టంచేశారు. చామరాజ్ నగర్ గ్రామస్తులు అయితే బెంగళూరు నుంచి వచ్చే బస్సులను తమ గ్రామంలోకి రానీయడం లేదు. ఉత్తర కర్ణాటకలో గల హవేరి, చిన్నముల్‌గండ్ వద్ద ఇంటికొకరు చొప్పున స్వచ్చందంగా సరిహద్దు వద్ద కాపలాగా ఉంటున్నారు. ఎవరైనా గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కర్రలను పట్టుకొని మరీ రానీయడం లేదు.

బెంగళూరులో వైరస్ ఎక్కువగా ఉండటంతో... బెంగళూరు నుంచి ఎవరైనా వచ్చినా.. ప్రబలుతోందని జనం భావిస్తునారు. అన్ లాక్ 2.0తో పరిస్థితి ఘోరంగా మారిపోయింది. హవేరి గ్రామస్తులు.. రోజుకు నాలుగు షిప్టుల చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. గత నెల మూడో వారంలో 7 వేల వాహనాలు వచ్చాయని ప్రజలు ఆందోళన చెందారని మంత్రి సీటీ రవి తెలిపారు. కానీ బెంగళూరు రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్న నంబర్ ప్లేట్లను ప్రజలు ఘోరావ్ చేశారు.

English summary
In a village in Mandya, between the cities of Bengaluru and Mysuru, a representative of the panchayat goes around beating drums and announcing, do not come here. If you do, you will be fine."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X