వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్జికల్ స్ట్రయిక్: 'ఆధారాలు కావాలంటే పాకిస్తాన్ వెళ్లి చూడండి'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ పైన నిలదీస్తున్న వారి పైన రా మాజీ అధికారి సహాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల విషయమై ఆధారాలు కావాలంటే ఎల్వోసీని దాటి పాకిస్తాన్ వైపు వెళ్లి చూడాలన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లి చూడవచ్చునన్నారు.

సర్జికల్ స్ట్రయిక్‌ను రాజకీయం చేయడం సరికాదన్నారు. ఇది జాతి భద్రతకు సంబంధించిందని చెప్పారు. ఆధారాలు కావాలని చెప్పే స్థానిక రాజకీయ నాయకులు ఎల్వోసీని దాటి వెళ్లి అక్కడ ఆధారాలు చూడాలని ఎద్దేవా చేశారు.

మోడీ నిర్ణయమే ఫైనల్

సర్జికల్ స్ట్రయిక్స్ వీడియో పుటేజ్ విడుదల చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరంలేదని ఇండియన్ ఆర్మీ తేల్చి చెప్పింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి ఇస్తే వీడియో పుటేజ్ బయటపెడతామని ఆర్మీ అధికారులు తెలిపారు.

 Surgical strike:

సర్జికల్ స్ట్రయిక్స్ అసలు జరగలేదన్న పాకిస్థాన్ మీడియా ప్రచారంతోపాటు కాంగ్రెస్, ఏఏపీ నేతలు దానికి వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో పక్కా సాక్ష్యాలు బయటపెట్టాలని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో బయటపెడితే అందరి నోర్లు మూయించవచ్చని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సీసీఎస్ మీటింగ్ ముగిసింది. తాజా పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక ఇచ్చారు.

ఇదిలా ఉండగా, సర్జికల్ దాడులు దేశ భద్రతకు సంబంధించిన అంశం. కానీ జాతీయ పార్టీల పుణ్యమా అని ప్రస్తుతం రాజకీయమంతా సర్జికల్ స్రైక్స్ చుట్టూనే తిరుగుతోంది. సర్జికల్ దాడులు చేసి పాక్‌కు తగిన గుణపాఠం చెప్పామని బీజేపీ చెబుతున్న మాటలు అవాస్తవమని కాంగ్రెస్, ఏఏపీ ఆరోపిస్తున్నాయి.

ఈ దాడులు నిజమైతే అందుకు సంబంధించిన వీడియో ఫుటేజిలను బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీంతో సచ్ఛీలతను నిరూపించుకునేందుకు బీజేపీ ముందడుగు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు కూడా దాడులకు సంబంధించిన వీడియోను బహిర్గతం చేసేందుకు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో ప్రధాన మంత్రి కార్యాలయమే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు మాట్లాడారు. సర్జికల్ స్ట్రయిక్ జరగలేదని చెబుతున్న పాక్ మీడియా నోరు మూయించాలంటే వీడియోను విడుదల చేయక తప్పదన్నారు. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఈ వీడియో పుటేజి అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందనే తుది నిర్ణయంగా భావించవచ్చు.

English summary
"If people want to play politics with national security, then god bless this country. Do these people want everything out in the open so that the operational details are out there? Those asking for proof must go to the Pakistan side of the Line of Control and look for it themselves."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X