వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీలో చేరిక వార్తను ఖండించిన సర్జికల్ స్ట్రైక్ హీరో లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్‌లోకి సర్జికల్ స్ట్రైక్స్‌ని లీడ్ చేసిన హీరో లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా జాయినైపోయారు అన్న వార్తను డిఎస్ హుడా ఖండించారు. ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్న జాతి భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశంపై విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పన కోసం ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ కు డి ఎస్ హుడా నేతృత్వం వహిస్తున్నారు. నేషనల్ లెవెల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటులో భాగంగానే ఆయన రాహుల్ గాంధీని కలిశారు.

కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ట్వీట్ ఈ గందరగోళానికి కారణం

కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ట్వీట్ ఈ గందరగోళానికి కారణం

మాజీ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా రాహుల్ గాంధీని కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ప్రియాంక చతుర్వేది చేసిన ట్వీట్ డీఎస్ హుడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్న భావనను కలిగించింది. దీంతో మాజీ లెఫ్టెనెంట్ జనరల్ డిఎస్ హుడా కాంగ్రెస్ పార్టీలో చేరి పోయారు అని ప్రచారం జరిగింది. దనిపై స్పందించిన ఆయన కేవలం నేషనల్ లెవెల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ విజన్ డాక్యుమెంటేషన్ లో భాగంగా తను రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన ప్రకటించారు.

హుడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు రావటంతోనే ఆయన పార్టీలో చేరారనే ప్రచారం

హుడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు రావటంతోనే ఆయన పార్టీలో చేరారనే ప్రచారం

2016లో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతితో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన టీమ్‌కి హుడా నేతృత్వం వహించారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌నే బిజెపి తమ ప్రభుత్వం ఘనతగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే అలాంటి దాడులకు నాయకత్వం వహించిన డిఎస్ హుడాహఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో ఆయన ఈలక భూమిక పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది.

జాతి భద్రత కోసం కాంగ్రెస్ నేషనల్ లెవెల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు .. హుడా నేతృత్వంలో విజన్ డాక్యుమెంట్

జాతి భద్రత కోసం కాంగ్రెస్ నేషనల్ లెవెల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు .. హుడా నేతృత్వంలో విజన్ డాక్యుమెంట్

పుల్వామా దాడి తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతి భద్రతకి ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఓ విజన్ డాక్యుమెంట్ తయారు చేయిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాహుల్ గాంధీని కలిసినట్లుగా తెలుస్తోంది.
జాతి భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేషనల్ లెవెల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు.
ఈ టాస్క్ ఫోర్స్ డిఎస్ హుడా మార్గదర్శకత్వంలో పని చేయనుంది. ఈ విజన్ డాక్యుమెంట్‌లో సరిహద్దుల భద్రత అందుకోసం ఎవరెవరితో చర్చలు జరపాలి అన్న అంశాలు పొందుపరుస్తారు. హుడా నేతృత్వంలోని ఈ నేషనల్ లెవల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ నెల రోజుల్లో తన నివేదిక సమర్పించనుంది.

English summary
Retired Army commander Lt. Gen DS Hooda, who is considered to be the main architect of the 2016 surgical strikes on terror launch pads along LoC in PoK, has categorically denied joining the Congress party.''I have not joined the Congress party,'' Lt Gen (retd) DS Hooda told . Congress president Rahul Gandhi was going to set up a task force on national security, which would be headed by Hooda, a former Northern Army commander. That task force, which would be led by Hooda, has been asked to prepare a vision paper for the country. Hooda met with Rahul Gandhi for this only .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X