వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌పై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్‌ ఉత్తదే?: కాంగ్రెస్ సంచలనం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా మోడీ ప్రభుత్వం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌ను రాజకీయాలకు అతీతంగా కొనియాడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దాడులు బూటకమని వాదిస్తోంది. పీఓకేలోని పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌‌ను మెచ్చుకుంటూనే, మరోవైపు ఆధారాలు బయటపెట్టమని మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రయిక్స్‌‌ తరహా దాడులు జరిపిందని, ప్రస్తుతం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మిలటరీ జరిపిన ఆ దాడులకు సబంధించిన తగిన ఆధారాలను బయటపెట్టాలని మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్మీ నియంత్రణ రేఖను దాటివెళ్లలేదని, ఇదేమాదిరి అతిపెద్ద దాడి 2013లో జనవరిలో యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన తెలిపారు. అయితే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించలేదని ఆయన పేర్కొన్నారు.

Surgical strikes: Sanjay Nirupam terms it 'fake', Chidambaram asks for proof

సర్జికల్ స్ట్రయిక్స్‌‌‌ను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయంగా మలచుకోవాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ జరిపే సర్జికల్ స్ట్రయిక్స్‌‌‌కు నరేంద్రమోడీ ప్రభుత్వానికి తామందరమూ వెన్నుదన్నుగా నిలుస్తామని, కానీ మిలటరీ చర్యలకు తగిన ఆధారాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సర్జికల్ దాడులు ముమ్మాటికీ అబద్ధం: సంజయ్ నిరుపమ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించాయని వస్తున్న వార్తలు ముమ్మాటికీ అబద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. ఆర్మీ సర్జికల్ స్టైక్స్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారని, నకిలీ దాడులు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

పాక్ మీడియాతో పాటు, కొన్ని అంతర్జాతీయ ఛానెళ్లలో వస్తోన్న వార్తా కథనాలు సర్జికల్ దాడులు జరగలేదనడానికి బలం చేకూరుస్తున్నాయని చెప్పారు. యూపిఏ హయాంలో కూడా మూడు సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినా తాము ప్రచారం చేసుకోలేదని, ప్రస్తుత మోడీ సర్కారు ఘనంగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

'పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిర్దేశిత దాడులు చేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం నకిలీ దాడి చేయాలని ప్రజలు కోరుకోలేదు. జాతి ప్రయోజనాలపై రాజకీయాలు చేయడం తగద'ని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పోస్టర్ల ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

English summary
Days after the party's top brass praised the armed forces and PM Modi over the surgical strikes carried out by Indian Army in PoK, Congress leader Sanjay Nirupam on Tuesday termed the surgical strikes carried out by the Indian Army across the LoC in Pakistan-Occupied Kashmir (PoK)as "fake" and accused the BJP of making political capital out of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X